Top Ad unit 728 × 90

'ఎంఐఎం'కి భయపడే కేసీఆర్ ఇలా చేస్తున్నారు: బండారు

'ఎంఐఎం'కి భయపడే కేసీఆర్ ఇలా చేస్తున్నారు: బండారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తీవ్రంగా విమర్షించారు. మజ్లిస్ పార్టీకి భయపడే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాటలే చెబుతున్నారనీ, ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని విమర్శించారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఏ విధంగా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొంటారో, అదే మాదిరిగా సెప్టెంబర్ 17న కూడా జెండా ఎగురవేయాలని సూచించారు. తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసి, ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులకు అవగాహన లేదని దేశ భద్రతకు సంబంధించి రాచపుండు లాంటి సమస్యకు ఆర్టికల్ 370 రద్దుతో పరిష్కారం లభించిందని ఈ సందర్భంగా దత్తాత్రేయ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆర్టికల్ 370పై అవగాహన లేక ఈ అంశాన్ని మతంతో ముడి పెడుతున్నారని విమర్శించారు. దేశానికి హోం మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం 370 రద్దును హిందూ ముస్లిం సమస్యగా పేర్కొనడం విచారకరమన్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

'ఎంఐఎం'కి భయపడే కేసీఆర్ ఇలా చేస్తున్నారు: బండారు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *