Top Ad unit 728 × 90

కొనసాగుతున్న వైద్యుల సమ్మె

కొనసాగుతున్న వైద్యుల సమ్మె

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల (జూడాల) సమ్మె ఐదో రోజుకు చేరుకున్నది. వారికి మద్దతుగా ఢిల్లీలోని పలు దవాఖానలకు చెందిన వైద్యులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర సచివాలయంలో చర్చలకు రావాలని సీఎం మమతాబెనర్జీ ఇచ్చిన పిలుపును వైద్యులు తిరస్కరించారు. తమ భద్రతపై భయాందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య సేవలు స్తంభించిపోయిన నేపథ్యంలో వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని డిమాండ్లకు సమ్మతించిందని చెప్పారు. మరోవైపు వైద్యుల సమ్మెపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖ రాష్ర్టానికి అడ్వైజరీని జారీచేసింది. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొన్నేండ్లుగా హత్యలు నమోదవుతున్న ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ వంటి రాష్ర్టాలకు అడ్వైజరీని జారీచేయాలని దీటుగా బదులిచ్చారు. కాగా వైద్యుల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి ముఖ్యమంత్రికి లేఖరాశారు. ప్రతిష్టంభనను తొలిగించేందుకు పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని కోరారు. గవర్నర్‌తో తాను మాట్లాడడని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయనకు వివరించానని అనంతరం సీఎం తెలిపారు. 

సమ్మెలో పాల్గొంటున్న వైద్యులపై తమ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించబోదని ఆమె స్పష్టం చేశారు. చర్చలకు జూడాలు రాకపోవడంతో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మాకు చట్టాలు ఉన్నాయి. అయితే వాటిని ఉపయోగించడం లేదు. జూనియర్ డాక్టర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోం. వారి భవిష్యత్తును ఇబ్బందులపాలు చేయం అని ఆమె చెప్పారు. నీల్ రతన్ సర్కార్ మెడికల్ కాలేజ్, దవాఖాన(ఎన్‌ఆర్‌ఎస్‌ఎంసీహెచ్)లో సోమవారం రాత్రి వైద్యులపై ఓ రోగి బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ జూడాలు ఆందోళనబాట పట్టారు. జూడాల కోసం శుక్రవారం ఐదు గంటలు వేచిచూశా. ఈరోజు (శనివారం) అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నా. రాజ్యాంగ వ్యవస్థ పట్ల మీరు కొంచెం గౌరవం చూపాలి అని మమత పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యుల సామూహిక రాజీనామాలపై ఆమె స్పందిస్తూ అవి చట్టపరంగా చెల్లుబాటు కావని చెప్పారు. తాను సమర్థురాలిని కాదని జూడాలు భావిస్తే.. వారు గవర్నర్ లేదా ప్రధాన కార్యదర్శి, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడుకోవచ్చు అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. 

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

కొనసాగుతున్న వైద్యుల సమ్మె Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *