Top Ad unit 728 × 90

అత్యంత ధనిక లోక్‌సభ అభ్యర్థి గౌతమ్ గంభీర్... ఆస్తి ఎంతంటే...?

అత్యంత ధనిక లోక్‌సభ అభ్యర్థి గౌతమ్ గంభీర్... ఆస్తి ఎంతంటే...?

ఆయన పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా అనేక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గౌతం గంభీర్. ప్రస్తుతం బీజేపీ తరపున తూర్పు ఢిల్లీ నుంచి బరిలో దిగుతున్నాడు. గెలుపు ఓటముల సంగతి అటు ఉంచితే ఢిల్లీ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల్లోనే అత్యధిక ధనిక అభ్యర్థిగా గంభీర్ స్పెషల్ ఎట్రాక్షన్.

7 లోక్ సభ నియోజకవర్గాలున్న దేశ రాజధాని ఢిల్లీలో 6వ విడతలో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయనేతగా మారిన మాజీ క్రికెటర్ గౌతంగంభీర్‌ బీజేపీ తీర్థం పుచ్చుకుని తూర్పు ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగారు. అయితే, ఢిల్లీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో గంభీర్ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అందరు అభ్యర్థుల్లో అత్యధిక ఆస్తితో ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం గంభీర్ ఆస్తుల విలువ 147 కోట్లు. వీటిలో స్థిరాస్థుల విలువ 116 కోట్లు కాగా చరాస్థులు 28 కోట్లు. 2017-18 సంవత్సరానికి గాను ఆయన 12 కోట్ల 40 లక్షల ఆదాయపు పన్నుకట్టిన గంభీర్ కు 34 కోట్ల 20 లక్షల అప్పు కూడా ఉన్నట్టు పేర్కొన్నాడు. గంభీర్ భార్య నటాషా గంభీర్ తన ఆస్తిని 6 లక్షలా 15 వేలుగా చూపించారు. తనపై ఒక చీటింగ్ కేసు కూడా పెండింగ్ లో ఉన్నట్టు గంభీర్‌ అఫిడవిట్ లో తెలిపారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

అత్యంత ధనిక లోక్‌సభ అభ్యర్థి గౌతమ్ గంభీర్... ఆస్తి ఎంతంటే...? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *