Top Ad unit 728 × 90

జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం

జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం

ఆంధప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేందుకు 'నవరత్నాల' పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీల్లో ఒకటి ఇప్పుడు మాయమైపోయిందని టీడీపీ నేత నారా లోకేశ్ వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం పేర్కొంది.

''46 ఏళ్ల జగన్‌కు ఉద్యోగం వచ్చింది గానీ.. 'నలభై ఐదేళ్ల వారికి పెన్షన్‌' రత్నం మాత్రం మాయమైంది' అని లోకేశ్‌ అన్నారు.

45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామన్న హామీ తమ మేనిఫెస్టోలో లేదంటూ అసెంబ్లీలో సీఎం, మంత్రులు చేసిన ప్రకటనపై ట్విటర్‌లో స్పందిస్తూ లోకేశ్ ఈ వ్యాఖ్య చేశారు.

''పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు మీరు కుర్చీ ఎక్కిన వెంటనే మరచిపోయారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత తేలిగ్గా మాట మార్చి వారిని మోసం చేశారు. ఆయన మడమ తిప్పడం, మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేలు నష్టం జరుగుతోంది'' అని అన్నారు.

మరో ట్వీట్‌లో 'మూర్ఖత్వం అసలు పేరు అహంభావం ముద్దు పేరు అనే వాడుక జగన్‌ గారిని చూస్తుంటే అక్షరాలా నిజం అనిపిస్తోంది' అని వ్యాఖ్యానించారు.

''విద్యుత్‌ ఒప్పందాలు పారదర్శకంగానే జరిగాయని, సమీక్ష వద్దని కేంద్రం, మేధావులు చెప్పినా ఆయన చెవికి ఎక్కలేదు. ఓ కమిటీ వేసి ఏదో చేసేద్దామని, అవినీతి నిరూపించాలని కసిగా ఉన్నారు. జగన్‌ గారూ! మీ కసి నాకు నచ్చింది. కానీ కేంద్ర సంస్థ ఎన్టీపీసీ వాళ్లకు నచ్చలేదనుకుంటాను. అందుకే ఒక లేఖ రాశారు. ఏమిటో  మీ కసిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు'' అని లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *