Top Ad unit 728 × 90

యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం... మానసిక ప్రశాంతత

యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం... మానసిక ప్రశాంతత

ఆరోగ్యమే మహాభాగ్యమన్నదే నానుడి. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడమే కాదు, మానసింకంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసిందే భారతదేశం. పూర్వకాలం నుంచి యోగ ద్వారా సామాన్య నుంచి మొదలుకుని సంపన్నుని వరకు యోగ ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని భారతీయులు గడుపుతూ వస్తున్నారు. ఈ జీవన విధానాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయాలనీ 2015 లో మోడీ సర్కార్ సంకల్పించింది. మోడీ ప్రభుత్వ కృషి ఫలించి ప్రతి ఏటా జూన్ 21 వ తేదీన ప్రపంచ యోగ డే ఐక్యరాజ్య సమితి గుర్తించింది. దాంతో ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా యోగ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

తాజాగా యోగాకు ప్రపంచ దేశాల్లో మరింత ప్రాచుర్యం కల్పించడానికి మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. యోగ ద్వారా తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ, మానసిక ప్రశాంతతో జీవిస్తున్న వారు అధిక సంఖ్యలోనే ఉన్నప్పటికీ, ఈ సంఖ్య మరింత పెరగడం కోసం , ప్రతి ఏటా భారత ప్రభుత్వం జూన్ 21 వ తేదీన ప్రపంచ యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈసారి ప్రపంచ యోగ దినోత్సవానికి ఝార్ఖండ్ రాజధాని రాంచి వేదిక కానుంది. ఈ కార్యకమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాంచి లోని ప్రభాత్ తారగ్రౌండ్ లో నిర్వహించే ప్రపంచ యోగ దినోత్సవ వేడుకలకు 30 వేల మంది హాజరయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంతులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.

ప్రపంచ యోగ దినోత్సవ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రతి ఒక్కరు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం తమ ఇంట్లోనే యోగాసనాలు వేసుకోవచ్చునన్నతెలియజెప్పడమేనని కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలకు యోగాపై అవగాహనా కల్పించేందుకు యోగ దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రపంచ యోగ దినోత్సవానికి ముందు, దేశం లోని వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు యోగ పై ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు యోగ డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ తరహా కార్యక్రమాలను చేపడుతున్నాయి.

ఈ ఆధునిక యుగం లో ఆరోగ్యంగా పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తపిస్తున్నారు. ఎవరికున్న వెసులుబాటును బట్టి వారు ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను పాటిస్తున్నారు. కొంతమంది జిమ్ కు వెళ్లి వ్యాయామం ద్వారా, మరికొంతమంది ఉదయాన్నే నడకతో తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడాని శ్రమిస్తున్నారు. అయితే యోగ ద్వారా ఆరోగ్య సంరక్షణ అన్నది మరింత సులువని దేశం లో చాలామంది ఇప్పటికి గ్రహించకపోవడం విచారకరం. యోగ ద్వారా తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని భావిస్తున్న వారికి కూడా అందుబాటు లో యోగాసనాలు నేర్పించే గురువులు లేకపోవడం కూడా ఒక కొరతనే చెప్పాలి. ఈ ప్రపంచ యోగ డే సందర్బంగా నైనా పూర్వికులు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన కోసం అవలంభించిన యోగ విధానం మరింత ప్రాచుర్యం పొంది ప్రతి ఒక్కరు తమ ఆరోగ్య పరిరక్షణ కు యోగాసనాలు వేయాలని ఆశిద్దాం.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం... మానసిక ప్రశాంతత Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *