Top Ad unit 728 × 90

తిండి కోసమే సైన్యంలోకి యువత.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిండి కోసమే సైన్యంలోకి యువత.. సీఎం సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి నోరుజారారు. ప్రముఖ సినీ నటి, ఎంపీ అభ్యర్థి సుమలతతో పాటు, సైన్యంపై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. మాండ్యా నియోజకవర్గంలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ, స్వతంత్ర అభ్యర్థి సుమలత మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుమలత పై కుమారస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16న సుమలత ఓ డ్రామా ఆడబోతున్నారని కుమార స్వామి ఆరోపించారు. ఆరోజున సుమలతపై కొందరు రాళ్ల దాడి చేస్తారని, ఆ తర్వాత ఆమె తలకు కట్టుతో కనిపిస్తారని పేర్కొన్నారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతుందన్న సీఎం, తన కార్యకర్తలతోనే సుమలత రాళ్లతో కొట్టించుకొని సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు.

కుమారస్వామి ఆరోపణలపై సుమలత తీవ్రంగా స్పందించారు. కుమారస్వామి వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయనే దాడికి కుట్ర పన్నారేమో అనిపిస్తోందని సుమలత అను మానం వ్యక్తం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే తేదీ, సమయం చెప్పడం చూస్తుంటే దాడి జరిగే అవకాశాలు మరింత స్పష్టంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత సైన్యంపై కుమారస్వామి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. రెండు పూటలా తిండి కోసమే భారతీయ యువత సైన్యంలో చేరుతోందని కుమారస్వామి పేర్కొన్నారు. భుక్తి కోసం ఆర్మీలో చేరే యోధుల జీవితాలతో ప్రధాని మోదీ చెలగాటమాడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు.

సైన్యంపై కుమారస్వామి ఆరోపణలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. దేశంపై అభిమానంతోనే యువత సైన్యంలో చేరుతున్నారు తప్ప పొట్టకూటి కోసం కాదని ఘాటుగా సమాధానమిచ్చింది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

తిండి కోసమే సైన్యంలోకి యువత.. సీఎం సంచలన వ్యాఖ్యలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *