Top Ad unit 728 × 90

ఎవరా 15 మంది?

 

ఎవరా 15 మంది?

అంబటి రాయుడికి అవకాశం దక్కుతుందా లేదా..? రెండో వికెట్‌ కీపర్‌ స్థానం రిషబ్‌  పంత్‌దేనా..? కేఎల్‌ రాహుల్‌కు చోటు ఖరారైనట్లేనా..? విజయ్‌ శంకర్‌ ఆల్‌రౌండ్‌ సత్తాపై సెలక్టర్లకు నమ్మకం కలిగిందా..?ఈ ప్రశ్నలన్నింటికీ సోమవారమే సమాధానం లభించబోతోంది.

ఉత్కంఠ ఇంకొన్ని గంటల్లోనే వీడబోతోంది. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌   వేదికగా ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ఎంపికకు రంగం సిద్ధమైంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత   సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. ముంబయిలో సమావేశమై జట్టును ఎంపిక చేయనుంది. ఈ రోజు రాత్రే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ముంబయిలో  ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడబోతున్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు కోచ్‌ రవిశాస్త్రి సైతం ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయి. కొన్ని నెలల కిందటే ప్రపంచకప్‌ జట్టు ఖరారైనట్లుగా కనిపించింది కానీ.. చివరగా భారత్‌ ఆడిన రెండు మూడు సిరీస్‌ల్లో కొందరు ఆటగాళ్ల ప్రదర్శనలో నిలకడ లేకపోవడంతో మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై ముందే ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. ఇంతకుముందు నాలుగో స్థానానికి పక్కా అనుకున్న రాయుడు.. తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేదు. ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌ స్థానానికి ముందు నుంచి రేసులో ఉన్న దినేశ్‌ కార్తీక్‌ కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అతడికి పోటీగా మారిన రిషబ్‌ పంత్‌ కూడా వన్డేల్లో అంత గొప్పగా రాణించిందేమీ లేదు. అతడికి కూడా చోటు పక్కా అని చెప్పలేం. ప్రత్యామ్నాయ ఓపెనర్‌ స్థానానికి పోటీలో ఉన్న కేఎల్‌ రాహుల్‌ మాత్రం ఇటీవల బాగానే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అతను అదరగొడుతున్నాడు. అతడికి చోటు దాదాపు ఖాయమైనట్లే. ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ సంగతి ఎటూ తేలకుండా ఉంది. జట్టులో దాదాపు 13 స్థానాలు ఖాయంగా ఉండగా.. ఇంకో రెండు బెర్తుల విషయంలోనే సందిగ్ధత నెలకొంది. శంకర్‌ను కాదని నాలుగో స్పెషలిస్టు పేసర్‌ను తీసుకోవాలనుకుంటే.. ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌ల్లో ఒకరిని ఎంచుకునే  అవకాశముంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

ఎవరా 15 మంది? Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *