Top Ad unit 728 × 90

పోలీసుకు పేలు చూసిన కోతి...!

పోలీసుకు పేలు చూసిన కోతి...!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కోతి చేసిన చేష్టలు ప్రజలకు నవ్వు తెప్పించడంతోపాటు ఆసక్తిని కలిగిస్తున్నాయి. పిలిభిత్‌లోని సదర్‌థానా పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లిన వానరం హౌస్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ ద్వివేది భుజాలపైకి ఎక్కింది. ఆ తర్వాత పేలు చూడడం మొదలుపెట్టింది. కోతి ఎలాంటి హానీ చేయకపోవడంతో ద్వివేది సైతం పట్టించుకోకుండా యథావిథిగా తన పనిచేసుకున్నారు. ఎవరో వీడియో తీసి షేర్‌ చేయడంతో కోతి చేష్టలు వైరల్‌గా మారాయి. తొలుత ఈ వానరం మహిళా కానిస్టేబుల్‌ వెంటపడగా... ఆమె బయపడి దానికి దొరకకుండా పారిపోయారని తర్వాత తన భుజంపైకి ఎక్కి పేలు చూసిందని ద్వివేది చెప్పారు. పట్టుకుంటే దాడి చేస్తుందనే ఉద్దేశంతో తన పనిని తాను చేసుకున్నానన్నారు. అనంతరం అటవీశాఖ అధికారుల సాయంతో కోతిని పట్టుకుని అడవిలో వదిలి పెట్టినట్లు చెప్పారు.

ముఖ్య గమనిక: వార్తలు, కథనాలు, భక్తి సమాచారం వ్రాయాలనుకున్తున్నారా...? మీ వివరాలను info@pslvtv.com OR pslvtv@gmail.com మెయిల్ చేయగలరు.

పోలీసుకు పేలు చూసిన కోతి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *