Top Ad unit 728 × 90

మోడీకి పాక్ మహిళ స్పెషల్ గిఫ్ట్...!

మోడీకి పాక్ మహిళ స్పెషల్ గిఫ్ట్...!

గురువారం(ఆగస్టు-15,2019)రక్షా బంధన్ సందర్భంగా ప్రధాని మోడీ రేపు ఢిల్లీలో తన ప్రత్యేక అతిధిని కలుసుకోనున్నారు. గతంలోలానే ఈ ఏడాది కూడా మోడీకి రాఖీ కట్టేందుకు పాక్ సంతతికి చెందిన ఖమర్ మోసిన్ షేక్ మోడఅీ నివాసానికి రానుంది. పాకిస్తాన్ లో పుట్టి పెరిగిన ఖమర్ పెళ్లి తర్వాత భారత్ లో సెటిల్ అయింది. గత 30ఏళ్లుగా ఆమె రక్షా బంధన్ రోజున మోడీకి రాఖీ కడుతున్న విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ఆమె మోడీకి రాఖీ కడుతూ వస్తున్నారు. తన సొంత అన్న కంటే మోడీనే తనను ఎక్కువగా ప్రేమిస్తాడని ఖమర్ అనేక సందర్భాల్లో తెలిపారు.

అయితే ఈ ఏడాది కూడా అదేవిధంగా మోడీకి రాఖీ కట్టడంతోపాటు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ఖమర్ రెడీ అయ్యింది. ప్రస్తుత దేశ పరిస్థితి గురించి తెలియజేసే ఓ పెద్ద పెయింటింగ్ ను మోడీ అన్నయ్యకు గిఫ్ట్ ఇవ్వబోతున్నానని ఖమర్ తెలిపింది. తన భర్త ఈ పెయింటింగ్ వేసినట్లు ఆమె తెలిపింది. దివంగత ప్రధాని వాజేపేయి ఫోఖ్రాన్ లో అణుపరీక్షలు జరిపినప్పుడు ఆయకు కూడా ఇలాంటిదే పెయింటింగ్ ఇచ్చినట్లు ఖమర్ తెలిపారు.

ఆర్టికల్ 370రద్దు నిర్ణయాన్ని ఆమె ప్రశంసించారు. మోడీలా ధైర్యం చేసి ఈ నిర్ణయం ఎవ్వరూ తీసుకోలేరన్నారు. మోడీ ఎప్పుడూ దేశ ప్రజలు కోరుకుందే చేశారన్నారు. తాను కూడా ముస్లిం అని,అంతా బాగానే ఉంది అని చెప్పగలనన్నారు. ముస్లింలు అందరూ సేఫ్ గా ఉన్నారన్నారు. ఇది జమ్మూకశ్మీర్ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయమని తెలిపారు. రేపు ఎర్రకోటపై పంద్రాగస్టు ప్రసంగం తర్వాత 7లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసంలో ఖమర్ తోమోడీ రాఖీ కట్టించుకోనున్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

మోడీకి పాక్ మహిళ స్పెషల్ గిఫ్ట్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *