Top Ad unit 728 × 90

మరో సంచలన చట్టం

మరో సంచలన చట్టం

రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పలు కీలక బిల్లులను ఆగమేఘాల మీద ఆమోదింప చేసుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం. మత మార్పిడులను నిరోధించేలా మరో సంచలన బిల్లుకు సిద్ధమైనట్టు సమాచారం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ప్రారంభించిందనీ. ఇదే అంశంపై ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఎలాంటి మత మార్పిడులనైనా నిరోధించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా మోదీ ప్రభుత్వం వడివడిగా పలు కీలక బిల్లులను తీసుకొచ్చింది. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ ముస్లిం మహిళా వివాహ హక్కుల బిల్లు వంటి పలు చారిత్రక బిల్లులు ఇందులో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల తీవ్ర అభ్యంతరాల నడుమ లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తీరును తప్పుపట్టిన ప్రతిపక్షాలు.. ట్రిపుల్ తలాక్‌ బిల్లుపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ట్రిపుల్ తలాక్ కారణంగా భర్తను జైలుకు పంపించే నిబంధనపై ప్రతిపక్షం అభ్యంతరం తెలిపింది. రాగా ఈసారి జరిగిన సమావేశాలు పార్లమెంటు చరిత్రలోనే ఉత్తమమైనవని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

మరో సంచలన చట్టం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *