Top Ad unit 728 × 90

మద్యం డోర్ డెలివరీ... షాకైన ముఖ్యమంత్రి...!

మద్యం డోర్ డెలివరీ... షాకైన ముఖ్యమంత్రి...!

రాష్ట్రం ఏదైనా సరే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో ఒకటి ఆబ్కారీ శాఖ. ఈ శాఖకోసం చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఒత్తిళ్ల వల్లనో, మరో గత్యంతరం లేకనో ఒక్కోసారి అలాంటి శాఖలు అసమర్దుల చేతుల్లోకి వెళ్లిపోతుంటాయి. మంత్రిగా బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తులు నోటికి ఏది వస్తే అది మాట్లాడి.. చివరకు తలనొప్పులు, తిప్పలు తెచ్చుకుంటూ ఉంటారు. అలా నొప్పులు, తిప్పలు తెచ్చుకున్న మంత్రి నగేష్. కర్ణాటక ఆబ్కారీ శాఖా మంత్రి.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అయన శాఖలో ప్రక్షాళన చేసేందుకు రెడీ అయ్యాడు. ఆ సమయంలో నోరుజారి  మద్యం డోర్ డోర్ డెలివరీ చేస్తామని అన్నారు. ఈ మాట అక్కడ పెద్ద దుమారాన్ని రేపింది. ఇప్పటికే మందుబాబులతో, మత్తులో మునిగిపోయింది కర్ణాటక. ఇంకా ఇంటికి మద్యం డోర్ డెలివరీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో అక్కడి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశాయి. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రి నగేష్ ను ఇంటికి పిలిపించుకొని మరి క్లాస్ తీసుకున్నారు.

పబ్లిక్ మీటింగ్ లలో, మీడియా ముందు మాట్లాడాల్సిన విధానం గురించి ఆయనకు పాఠాలు బోధించారట. తాను అలా అనలేదని, డోర్ డెలివరీ చేయడం వలన మద్యం అమ్మకాలు తగ్గించవచ్చనే ఉద్దేశ్యంతో అన్నానని అన్నారు. ఆ తరువాత రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించే ఆలోచనలో ఉన్నట్టు మంత్రి నగేష్ పేర్కొన్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

మద్యం డోర్ డెలివరీ... షాకైన ముఖ్యమంత్రి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *