Top Ad unit 728 × 90

Jio Postpaid Plus: ఒకే మొబైల్ కనెక్షన్... ఇంట్లో అందరికీ 4జీ డేటా... 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్'తో లాభాలు ఇవే

Jio Postpaid Plus: ఒకే మొబైల్ కనెక్షన్... ఇంట్లో అందరికీ 4జీ డేటా... 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్'తో లాభాలు ఇవే

జియోఫైబర్ సంచలనాలు సృష్టించబోతోంది. దాంతోపాటు జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ను కూడా ప్రకటించింది రిలయెన్స్. అయితే ఇప్పటికే జియో పోస్ట్‌పెయిడ్ సర్వీస్ ఉంది. కానీ 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' సర్వీస్‌లో సేవలు అదనంగా లభిస్తాయి. జియోఫైబర్ యూజర్లు 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' కూడా తీసుకోవచ్చు. వీరికి ప్లాటినమ్ గ్రేడ్ సర్వీసులు లభిస్తాయి. అంటే జియోఫైబర్ సేవల్ని ఉపయోగిస్తున్నవారికే 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' సర్వీస్ లభిస్తుంది. జియోఫైబర్ తీసుకున్నవాళ్లు 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' కూడా కావాలి అనుకుంటే జియో సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి సిమ్ సెటప్ చేస్తారు. ఇందుకోసం ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' సర్వీస్‌ను మీ డివైజులు అన్నింటికీ వాడుకోవచ్చు. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి వస్తుంది. టారిఫ్ వివరాలు ఇంకా తెలియవు. జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లో టారిఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వస్తాయి.

మీరు ఒక 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' కనెక్షన్ తీసుకుంటే అందులోని 4జీ డేటాను మీ కుటుంబ సభ్యులకు పంచుకోవచ్చు. ఎవరికి ఎంత డేటా షేర్ చేయాలో అంత షేర్ చేయొచ్చు. డేటాను సమర్థవంతంగా, పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' యూజర్లకు ఇంటర్నేషనల్ రోమింగ్ తక్కువ ధరకే లభిస్తుంది. మిగతా జియో సబ్‌స్క్రైబర్లకు ఉన్న ఛార్జీల కన్నా 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' యూజర్లకు ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఇక మీ ఇంటి కోసం తీసుకునే ఇంటర్నెట్ కనెక్షన్, టీవీ బిల్, మొబైల్ బిల్ ఇలాంటివన్నీ వేర్వేరుగా లేకుండా మొత్తం ఒకే ప్యాకేజీలో లభిస్తుంది. 

 

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

Jio Postpaid Plus: ఒకే మొబైల్ కనెక్షన్... ఇంట్లో అందరికీ 4జీ డేటా... 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్'తో లాభాలు ఇవే Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *