Top Ad unit 728 × 90

జెడ్పీటీసీ, ఎంపిపిల‌ను గెలిపించే బాధ్యత వారికి అప్పగించనున్న కేసీఆర్...!

జెడ్పీటీసీ, ఎంపిపిల‌ను గెలిపించే బాధ్యత వారికి అప్పగించనున్న కేసీఆర్...!

స్థానిక సంస్థల్లో గులాబి జెండా ఎగ‌ర‌వేసేందుకు టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో 16 సీట్లు క‌చ్చితంగా గెలుస్తామ‌ని ధీమాతో ఉన్న ఆయ‌న‌.. ఇక స్థానిక పరిషత్ ఎన్నిక‌ల్లోనూ ఘ‌న‌విజ‌యం సాధించేందుకు సిద్దమ‌వుతున్నారు. ఇందుకోసం తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా సోమవారం పార్టీ ప్రజా ప్రతినిధుల‌తో విస్తృత స్థాయి స‌మావేశం నిర్వహించ‌బోతున్నారు.

స్థానిక ఎన్నికలపై పూర్తిగా ఫోకస్‌ చేశారు కేసీఆర్‌. దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ ముగిసేలోపు తెలంగాణ‌లో లోక‌ల్ బాడి ఎన్నిక‌లు పూర్తిచేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు కేసీఆర్‌. మే 22 లోపు ఎన్నిక‌లు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం మ‌రో రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడ‌ర్‌ను ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేసేందుకు కేసీఆర్ రెడి అయ్యారు. ఇందులో బాగంగా సోమవారం తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలతో పాటూ మొత్తం పార్టీ కీల‌క కార్యవ‌ర్గంతో స‌మావేశం కానున్నారు కేసీఆర్.

రాష్ట్రంలో 32 జెడ్పీ చైర్మన్‌లను కైవసం చేసుకోనే దిశ‌గా కేసీఆర్ పార్టీనేత‌ల‌కు దిశా నిర్దేశం చేయ‌నున్నారు. రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ స్థానాలకు, 5857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల‌పై జరుగుతాయి. ఈ నేపథ్యంలో.. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం సమావేశంలో విస్తృతంగా చ‌ర్చించున్నారు. అసెంబ్లీ, గ్రామ‌పంచాయ‌తి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ప్రజ‌లు ఇచ్చార‌ని.. పార్టీ భావిస్తోంది.

ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో అన్ని జెడ్పీస్థానాల్లో గులాబి జెండా ఎగ‌ర‌వేసేందుకు పార్టీ ముఖ్యనేత‌ల‌కు భాద్యత‌లు అప్పగించనున్నారు కేసీఆర్. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో, జెడ్పీటీసిల‌ను ఎంపిపిల‌ను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేల‌కు అప్పగించ‌నున్నారు. వీరితో పాటూ ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యద‌ర్శుల‌కు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇక జెడ్పీ చైర్మన్ ప‌ద‌వుల‌ను కైవసం చేసుకొనేలా మంత్రులు కృషిచేయాల‌ని కేసీఆర్ సూచించ‌నున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు అనుసరించిన వ్యూహంతో మంచి పలితాలు సాదించారు. అతర్వాతా పార్లమెంటు ఎన్నికల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నహాక సమావేశాలతో క్యాడర్‌లో ఉత్సాహాం నింపారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికల పూర్తైతే వచ్చే నాలుగున్నర ఏళ్లు పాలనకు ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకు గులాబి బాస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

జెడ్పీటీసీ, ఎంపిపిల‌ను గెలిపించే బాధ్యత వారికి అప్పగించనున్న కేసీఆర్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *