Top Ad unit 728 × 90

ఆర్ఎక్స్ 100 సినిమా స్ఫూర్తితో ఆరిపోయిన దీపాలు

ఆర్ఎక్స్ 100 సినిమా స్ఫూర్తితో ఆరిపోయిన దీపాలు 

జగిత్యాల స్నేహితుల మ‌ర‌ణంపై డీఎస్పీ వెంక‌ట‌ర‌మ‌ణ‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇద్దరూ వేర్వేరు అమ్మాయిల‌ను ప్రేమించారని, ఆర్ఎక్స్ 100 సినిమా స్ఫూర్తితో చ‌నిపోయారని చెప్పారు. స్నేహితుల మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌ను ప‌రిశీలిస్తున్నామని, కాల్ డేటా సేక‌రిస్తున్నామని తెలిపారు. వారిది హ‌త్య కాదని, ఆత్మహ‌త్య అని ద‌ర్యాప్తులో తేలిందని ఆయన వెల్లడించారు. కేసును లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నామని వెంక‌ట‌ర‌మ‌ణ‌ పేర్కొన్నారు.

జగిత్యాలకు చెందిన మహేందర్‌, రవితేజ ఒకే అమ్మాయిని ప్రేమిస్తుండడంతో ఆ విషయంలో తరచూ గొడవ పడుతుండేవారు. ఆదివారం మహేందర్‌, రవితేజ మరో స్నేహితుడితో కలిసి పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌లో మద్యం సేవించారు. తాగిన మైకంలోఇద్దరూ గొడవ పడినట్లు సమాచారం. అది ముదరడంతో ఒకరిపైన మరొకరు పెట్రోలు చల్లుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం వారి స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో చిక్కుకుని మహేందర్‌ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు. రవితేజను జగిత్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవితేజ మృతి చెందాడు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆర్ఎక్స్ 100 సినిమా స్ఫూర్తితో ఆరిపోయిన దీపాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *