Top Ad unit 728 × 90

ట్రంప్‌కు ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా -పోర్న్‌స్టార్‌...!

ట్రంప్‌కు ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా -పోర్న్‌స్టార్‌...!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తనకు గతంలో ఎఫైర్‌ ఉందని ఓ పోర్న్‌ స్టార్‌ చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్షుడితో తన సంబంధం గురించి బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్‌ న్యాయవాది తనకు చెల్లించిన 1,30,000డాలర్లను తిరిగిచ్చేస్తానని శృంగార తార స్టీఫెన్‌ క్లిఫోర్డ్‌ అలియాస్‌ స్టోర్మీ డేనియల్స్‌ ప్రకటించారు. ఇటీవల ఆమె ఇదే విషయంపై కోర్టుకెక్కారు కూడా. తాను నోరు మెదపకుండా ఉండేందుకు ట్రంప్‌ న్యాయవాది తనుకు 1,30,000డాలర్లు ఇచ్చి నాన్‌డిస్‌క్లోజర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని, అయితే దానిపై ట్రంప్ సంతకం చేయనందున అది చెల్లదని ప్రకటించాలని ఆమె కోర్టును కోరిన సంగతి తెలిసిందే. తాజాగా డబ్బు తిరిగేస్తానని పేర్కొంటూ ట్రంప్‌ న్యాయవాది మైకేల్‌ కోహెన్‌కు లేఖ రాసి పంపారు. ఈ ఆఫర్‌ మంగళవారం వరకు మాత్రమే అని స్పష్టంచేశారు. డబ్బు తిరిగి ఇచ్చేస్తే క్లిఫోర్డ్‌ నిర్భయంగా ట్రంప్‌తో తన ఎఫైర్‌ గురించి మాట్లాడొచ్చని, ట్రంప్‌తో దిగిన ఫొటోలు, వీడియోలు బహిర్గతం చేయొచ్చని ఆమె న్యాయవాది మైకేల్‌ అవెనట్టి పేర్కొన్నారు. ఆమె ట్రంప్‌ న్యాయవాదితో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ట్రంప్‌తో తన సంబంధం బయటపెడితే మిలియన్‌ డాలర్లు జరిమానా కట్టాల్సి ఉంటుందని అవెనట్టి చెబుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య సంబంధం బయటపెడితే తామే పెనాల్టీ కడతామని పది మంది ముందుకొచ్చారని వెల్లడించారు. అయితే ట్రంప్‌ మాత్రం క్లిఫోర్డ్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తనతో ఎలాంటి సబంధం లేదని చెబుతున్నారు. క్లిఫోర్డ్‌ ఆఫర్‌ ఇవ్వడంపై ట్రంప్‌ న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ ఇంకా స్పందించలేదు. అధ్యక్ష నివాసమైన శ్వేతసౌధం కూడా ఈ విషయంపై స్పందించలేదు. గతంలో ట్రంప్‌ న్యాయవాది తాను క్లిఫోర్డ్‌కు 1,30,000 డాలర్లు తన జేబులో నుంచి కట్టానని, అవి ఆమె తిరిగి ఇవ్వలేదని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లావాదేవీలతో ట్రంప్‌కు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

ట్రంప్‌కు ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా -పోర్న్‌స్టార్‌...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *