Top Ad unit 728 × 90

నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతల షాకింగ్ కామెంట్స్

నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతల షాకింగ్ కామెంట్స్

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతలు షాకింగ్ కామెంట్స్ చేశారు. నోటా సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని ఆ పార్టీ నేతలు పొంగులేటి, గూడూరు నారాయణరెడ్డి అన్నారు. నోటా సినిమా ప్రేరణతో నోటా మీట నొక్కే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ఎన్నికల కమిషన్, సెన్సార్ బోర్డ్ సభ్యులు నోటా సినిమాను పరిశీలించాలని, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించాలని పొంగులేటి, గూడూరు డిమాండ్ చేశారు. కాగా... గత కొద్దిరోజులుగా ఈ సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే.. ఈ సినిమాను విడుదలను ఆపాలంటూ మాజీ సెన్సార్ బోర్డు సభ్యులు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. నోటా చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, విడుదలకు ముందే రాష్ట్ర ఎన్నికల అధికారులు, డీజీపీ ఈ సినిమా చూశాకే విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాకు టైటిలే ఒక వివాదంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ వివాదంపై విజయ్ మాట్లాడుతూ...

‘నోటా’ వల్ల ఎన్నికలు ప్రభావితం అవుతున్నాయి. ప్రజలు ‘నోటా’ బటన్‌ నొక్కుతారేమో...? అనీ, ఈ సినిమా తెలంగాణలో ఒక పార్టీకి అనుకూలంగా వుందనీ, అందువల్ల విడుదలను నిలిపేయాలనీ కొంతమంది కేసులు పెట్టారు. వాళ్ళంతా ఎందుకు భయపడుతున్నారు? నన్ను అడిగితే... నేను చెబుతా కదా! మేం ‘నోటా’ బటన్‌ నొక్కాలని చెప్పడం లేదు. ఒక పార్టీకి ఫేవర్‌గా ఏం చేయడం లేదు. ఒక్కటి మాత్రం నిజం. ఎన్నికలను ప్రభావితం చేసే పవర్‌ మన దగ్గర ఉంది. సినిమాలో యువ ముఖ్యమంత్రిని చూస్తారు" అని స్పష్టం చేశారు.

నోటా’ సినిమాపై కాంగ్రెస్ నేతల షాకింగ్ కామెంట్స్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *