Top Ad unit 728 × 90

గూగుల్ గుంజిన ప్రేమికుల రాసలీల ఫోటో... జర జాగ్రత్త...!

గూగుల్ గుంజిన ప్రేమికుల రాసలీల ఫోటో... జర జాగ్రత్త...!

ప్రేమికులు పార్కులలోని చెట్లమాటున, పొదలమాటున రెచ్చిపోవడం కామన్. ఎవరూ లేని ప్రదేశాల్లో అయితే ఇక వాళ్లకు అడ్డుండదు. తాజాగా... అలా రెచ్చిపోయిన ఓ జంట మాత్రం గుగుల్ స్ట్రీట్ వ్యూ దెబ్బకు అడ్డంగా బుక్ అయిపోయారు. వివరాల్లోకి వెళ్తే... చుట్టూ ఎవరూ లేరు కదా అని తైవాన్‌లోని ఓ జంట రొమాన్స్‌లో మునిగిపోయారు. దుస్తులు విప్పేసి నగ్నంగా ఒకరినొకరు బిగి కౌగిళ్లలో బంధించుకుని పరవశించిపోయారు.

అయితే గూగుల్ మాత్రం వారి గుట్టు బయటపెట్టేసింది. వారి ఏకాంత క్షణాలను గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరా క్లిక్ చేసి నేరుగా మ్యాప్‌లలోకి అప్‌లోడ్ చేసేసింది. ఎవరైనా ఇప్పుడు ఆప్రాంతంలో స్ట్రీట్ వ్యూ చూస్తే, ఈ నగ్న జంట చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వేల మంది ఈ ఫోటోను చూశారు.

గూగుల్ శాటిలైట్ మ్యాప్‌ వ్యూలో తైవాన్‌ తైచుంగ్ నగరంలోని శాంటియన్ రోడ్‌ ప్రాంతంలో ఈ ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవగా... ఆ జంట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. కొందరు ఆకతాయిలు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది ఇంకా వైరల్‌గా మారింది.

అయితే వాస్తవానికి ఈ ఫొటోను గూగుల్ స్ట్రీట్ వ్యూ కావాలని తీసింది కాదు. 360 డిగ్రీ టెక్నాలజీ కెమెరాలతో చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను గూగుల్ క్లిక్ చేసి శాటిలైట్ మ్యాప్‌లో పెడుతుంది. ఈ రకంగా ఫోటో క్లిక్ అయ్యింది. ఏది ఏమైనా టెక్నాలజీ యుగంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా? లేకుంటే ఇలానే బుక్కైపోతారు.

గూగుల్ గుంజిన ప్రేమికుల రాసలీల ఫోటో... జర జాగ్రత్త...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *