Top Ad unit 728 × 90

ఇబ్రహీంపట్నం టికెట్‌ విషయంలో టీడీపీ ఉత్కంఠ సాగిస్తోంది

ఇబ్రహీంపట్నం టికెట్‌ విషయంలో టీడీపీ ఉత్కంఠ సాగిస్తోంది...!

ఇబ్రహీంపట్నం టికెట్‌ విషయంలో టీడీపీ ఉత్కంఠ సాగిస్తోంది. ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డికి రెండ్రోజుల కిత్రమే ఈ స్థానాన్ని ఖరారుచేసినా, చివరి క్షణంలో పెండింగ్‌లో పెట్టింది. ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వచ్చిన అభ్యర్థులతోపాటు ఆయనా ప్రమాణ స్వీకారం చేశారు. అందరికీ ఇచ్చినా సామకు మాత్రం బీఫామ్‌ ఇవ్వలేదు. బీఫామ్‌లో పేరు తప్పు వచ్చిందని చెప్పి పెండింగ్‌లో పెట్టారు. అనూహ్య పరిణామంతో ఆయన కంగుతిన్నారు. రెండు గంటల్లో చెప్తామని అక్కడే ఉంచి, రాత్రి 10గంటలకూ తేల్చలేదు. ఇంకా ఈ సీటుపై టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. సోమవారం నామినేషన్‌కు సన్నాహాలు చేసుకున్న సమయంలో గందరగోళo నెలకొనడంపై సామతోపాటు ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

ఫోన్‌కాలే కారణమా...?

సామ రంగారెడ్డికి బీఫామ్‌ ఇవ్వకపోడం వెనుక ఫోన్‌కాల్‌ కారణమని తెలుస్తోంది. ఎల్‌బీనగర్‌ టికెట్‌ ఆశించిన సామకు ఇబ్రహీంపట్నం టికెట్‌ ఇవ్వడంతో ఆయన అసహనానికి గురయ్యారు. సీటు మార్చమని కోరేందుకు అమరావతి కూడా వెళ్లారు. పార్టీ నాయకత్వం బుజ్జగించి పంపడంతో ఇబ్రహీంపట్నం నుంచే పోటీకి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కార్యకర్త పేరుతో ఒకరు ఆయనకు ఫోన్‌ కాల్‌ చేసి కవ్వించారు. అసలే కాక మీద ఉన్న రంగారెడ్డి పార్టీవాళ్లు ఇలా చేశారంటూ కొన్ని పదాలు జారారు. అది రికార్డు చేసిన వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో కొందరు శనివారం పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో టికెట్‌ తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఈ స్థానాన్ని మరో టీడీపీ నేత రొక్కం భీమ్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఆదివారం ఆయన అమరావతిలో మకాం వేశారు. కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ కోరుతున్న మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఈ సీటు కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు.

ఇబ్రహీంపట్నం టికెట్‌ విషయంలో టీడీపీ ఉత్కంఠ సాగిస్తోంది Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *