Top Ad unit 728 × 90

ఈ నగరానికి ఏమైంది : హైదరాబాద్ లో నిజాయతీ లేదు

ఈ నగరానికి ఏమైంది : హైదరాబాద్ లో నిజాయతీ లేదు

హైదరాబాద్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మెట్రో సిటీ. ఐటీ రంగానికి కేరాఫ్. బిజినెస్ లకు అడ్డా. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ ఘనత గురించి చాలానే ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఏం లాభం.. అసలైన విషయంలో మన హైదరాబాద్ వెనకబడింది. హైదరాబాద్ లో నిజాయతీ లేదట. అవును నిజాయతీ విషయంలో హైదరాబాద్‌ కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. నగరవాసుల్లో నిజాయతీ పెరగాలని నివేదికలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.

దేశంలోని 4 ప్రధాన నగరాల్లో పౌర నిజాయతీపై ఓ అంతర్జాతీయ సంస్థ జరిపిన అధ్యయనంలో హైదరాబాద్‌ లాస్ట్ ప్లేస్(7)లో ఉంది. పార్కులు, బహిరంగ ప్రదేశాలు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల దగ్గర దొరికిన వస్తువులను కంటికి రెప్పలా కాపాడి.. అపరిచితులకు చెందిన వస్తువులు దొరికితే నిజాయతీగా పోలీసులకు అప్పగిస్తున్న వారిపై 'గ్లోబల్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌' సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది.

వరల్డ్ వైడ్ గా 30 దేశాల్లోని 355 నగరాలపై ఈ సంస్థ పరిశోధక బృందం సభ్యులు అధ్యయనం చేశారు. ఈ విషయంలో డెన్మార్క్‌ దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో 82శాతం పౌర నిజాయతీ ఉంది. ఇండియా విషయానికి వస్తే 7 ప్రధాన నగరాలపై అధ్యయనం చేశారు. బెంగళూరు 66.7శాతంతో పౌర నిజాయతీలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కోయంబత్తూర్‌ (57.1%), మూడో స్థానంలో కోల్‌కతా (46.7%), నాలుగో స్థానంలో ఢిల్లీ (43.8%) ఐదో స్థానంలో అహ్మదాబాద్‌ (40%) ఉన్నాయి. రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌ 38.5 శాతంతో ఆరో స్థానంలో నిలిచింది. చివరి స్థానంలో హైదరాబాద్‌ (28.6 శాతం) ఉంది. మన సిటీలో ఈ విషయం మరింత పురోగతి సాధించాల్సిన అవసరముందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు, పార్కుల్లో విలువైన వస్తువులను పలువురు ఆటోడ్రైవర్లు, నగర పౌరులు తమకు జాగ్రత్తగా అప్పచెప్పి నిజాయితీ చాటుకుంటున్నారని సిటీ పోలీసులు తెలిపారు. ఇది సరిపోదని, నిజాయతీ పాళ్లు ఇంకా పెరగాల్సి ఉందన్నారు.

పౌర నిజాయితీ విషయంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో పరిస్థితిని గమనిస్తే పురుషుల కంటే మహిళలే అత్యంత నిజాయితీగా ఉన్నారట. 56.4 శాతం మంది మహిళలు నిజాయితీపరులు ఉండగా  పురుషుల్లో 40.6 శాతం మాత్రమే నిజాయితీ పరులున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అన్ని అంశాలు కాకపోయినా  కనీసం బహిరంగ ప్రదేశాల్లో తమ కంటపడిన విలువైన వస్తువులను జాగ్రత్తగా పోలీసులకు అప్పగిస్తున్న వారి శాతం ఇటీవల పెరుగుతుండటంపై సామాజికవేత్తలు, పోలీసులు గొప్ప విషయంగా చెబుతున్నారు.

మెట్రో నగరాల్లో క్షణం తీరకలేకుండా బిజీగా గడిపే సిటిజన్లు తరచూ తమ ల్యాప్‌టాప్‌లు, పర్సులు, బంగారు ఆభరణాలు పోగొట్టుకుంటున్నారు. ఇందులో అత్యధికంగా పర్సులే ఉంటున్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఇక పౌర నిజాయితీ విషయానికి వస్తే పర్సుల్లో వేల రూపాయలు  క్రెడిట్, డెబిట్‌ కార్డులున్నప్పటికీ నిజాయితీపరులు వాటివైపు కన్నెత్తి చూడకుండా యథావిధిగా ఆయా పర్సులను పోలీసులకు అప్పజెబుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.

మొత్తంగా పౌర నిజాయతీలో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్ లో ఉందనే వార్త కొంత బాధాకరమే. ఈ విషయంలో నగరవాసులు తమ తీరుని మార్చుకోవాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది  నిజాయతీ పెంచుకోవాల్సి అవసర ఎంతైనా ఉంది. చాలా అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన హైదరాబాద్ పౌర నిజాయతీలో వెనకబడటం కొంత ఆందోళనకరమే అని సామాజికవేత్తలు అంటున్నారు. ఈ నివేదిక తర్వాత అయినా నగరవాసుల్లో మార్పు వస్తుందని, నిజాయతీ శాతం పెరుగుతుందని ఆశిద్దాం.

పౌర నిజాయితీలో నగరాల స్థానం:

నగరం స్థానం పౌర నిజాయితీ శాతంలో
బెంగళూరు 1 66.7
కోయంబత్తూర్‌ 2 57.1
కోల్‌కతా 3 46.7
ఢిల్లీ 4 43.8
అహ్మదాబాద్‌ 5 40
జైపూర్‌ 6 38.5
హైదరాబాద్‌ 7 28.6

పౌర నిజాయితీలో టాప్‌ 5 దేశాలు

దేశం నిజాయతీ శాతం
డెన్మార్క్‌ 82
స్వీడన్‌ 81.5
న్యూజిల్యాండ్‌ 80
స్విట్జర్లాండ్‌ 79
నార్వే 78.7

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

ఈ నగరానికి ఏమైంది : హైదరాబాద్ లో నిజాయతీ లేదు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *