Top Ad unit 728 × 90

జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన బీజేపీ... షాక్ లో చంద్రబాబు

జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన బీజేపీ... షాక్ లో చంద్రబాబు

మరికొద్దిరోజుల్లో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఖాళీ కాబోతుందా అంటే! అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుతం బీజేపీ నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే. కొద్దికాలంగా బీజేపీ నాయకులు ఎక్కడ మీడియా కనిపిస్తే చాలు అక్కడ తమ పార్టీలో టీడీపీ నాయకులు చేరబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తమ పార్టీ మజీ ఎంపీలు ఎమ్మెల్యేలు చేరబోతున్నారని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా అదే పల్లవిని అందుకున్నారు. తమ పార్టీలో చేరేందుకు టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. తమ పార్టీకి టచ్ లో ఉన్నది కేవలం టీడీపీ నేతలే కాదని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోమా స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఆ పార్టీకి ఆయువుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరితో దరిదాపు ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఖాళీ అవ్వడం ఖాయం అని రాజకీయ నాయకులు అంటున్నారు. ఇక టీడీపీ గురించి బీజేపీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ ఖాళీ అవుతుందని అంటున్నారు. ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేశ్ అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు తప్ప ఎవ్వరు ఉండరని బీజేపీ నాయకులు అంటున్నారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన బీజేపీ... షాక్ లో చంద్రబాబు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *