Top Ad unit 728 × 90

చరిత్ర సృష్టించిన గేల్...!

చరిత్ర సృష్టించిన గేల్...!

వెస్టిండిస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. భారత్-వెస్టిండిస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా గురువారం తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. అయితే, వర్షం కారణంగా రద్దైన ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్(4) పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.తద్వారా వెస్టిండిస్ తరపున అత్యధిక వన్డే మ్యాచులు ఆడిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు బ్రియాన్ లారా(295) వన్డేలతో వెస్టిండిస్ తరుపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.అయితే, గురువారం నాటి మ్యాచ్‌తో క్రిస్ గేల్ విండీస్ తరపున అత్యధికంగా 296 అంతర్జాతీయ వన్డే మ్యాచులు ఆడి లారా రికార్డుని బద్దలు కొట్టాడు. లారా తర్వాత ఈ జాబితాలో చందర్ పాల్ 268, డెస్మండ్ హేన్స్ 238, వివ్ రిచర్డ్స్ 187 ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

వెస్టిండిస్ తరుపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్లు: 296: Chris Gayle, 295: Brian Lara, 268: Shivnarine Chanderpaul, 238: Desmond Haynes, 187: Viv Richards.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

చరిత్ర సృష్టించిన గేల్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *