Top Ad unit 728 × 90

జగన్ ప్లాన్ వర్కవుటైతే చంద్రబాబుకు దెబ్బే

జగన్ ప్లాన్ వర్కవుటైతే చంద్రబాబుకు దెబ్బే

ఏ రాజకీయ పార్టీ అయినా లేకపోతే నేత అయినా ఏమి చేసినా అంతిమంగా ఓట్ల కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన పని కూడా ఇందులో భాగమే. బడుగు, బలహీన వర్గాలైన బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, మహిళలను వైసిపికి స్ధిరమైన ఓటు బ్యాంకుగా మలచుకునేందుకు జగన్ బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. జగన్ ప్లాన్ గనుక వర్కవుటైతే చంద్రబాబునాయుడు పని గోవిందా అనే చెప్పాలి.

తాజాగా పైన చెప్పిన వర్గాలకు నామినేటెడ్ వర్కుల్లో 50 శాతం కేటాయించాలని, మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కేటాయిస్తు, పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు, శాస్వత ప్రాతిపదికన బిసి కమీషన్ ఏర్పాటు తదితర అంశాలపై బిల్లులను అసెంబ్లీలో పాస్ చేయించుకున్నారు.

జగన్ ఉద్దేశ్యాన్ని గ్రహించిన తర్వాతే చంద్రబాబు అసెంబ్లీలో గోల మొదలుపెట్టారు. ఎలాగైనా బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనీయకుండా అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వైసిపికున్న బలం దృష్ట్యా చంద్రబాబు ఎత్తులు సాగలేదు. మొన్నటి ఎన్నికల్లో పై వర్గాలకు చెందిన మెజారిటి ఓటర్లు వైసిపికి మద్దతుగా నిలబడటంతోనే అఖండ విజయం సాధ్యమైంది. పై వర్గాల్లో బిసిలు మొదటిసారి జగన్ కు మద్దతుగా నిలబడ్డారు.

ఈ విషయాలన్నింటినీ భేరీజు వేసుకున్న తర్వాత పై వర్గాలను వైసిపితోనే శాస్వతంగా ఉంచుకోవాలని ప్లాన్ వేశారు. అందుకనే పాదయాత్రలో హామీని నెరవేర్చుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికలో అయినా పై వర్గాలు వైసిపినే అంటిపెట్టుకునుండాలి. అదే జరిగితే రాజకీయంగా చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

జగన్ ప్లాన్ వర్కవుటైతే చంద్రబాబుకు దెబ్బే Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *