Top Ad unit 728 × 90

బీజేపీ కొత్త ప్లాన్, జానారెడ్డి కొడుక్కి గాలం

బీజేపీ కొత్త ప్లాన్, జానారెడ్డి కొడుక్కి గాలం

తెలంగాణలో రాజకీయాలు రంజుగా మారాయి. హుజూర్ ఉప ఎన్నికపై పార్టీలన్నీ ఫోకస్ చేయడంతో రాజకీయం హీట్ గా మారింది. ఎలాగైన హుజూర్ నగర్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తుండగా అప్పుడే అభ్యర్థిని ప్రకటించి టీఆర్ఎస్ దూకుడుగా వెళ్తుంది.

హుజూర్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన కాసేపటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని బరిలోకి దింపుతున్నామని ప్రకటించి రాజకీయ వేడిని రగిలించారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ చేతిలో ఓడిపోయిన సైదిరెడ్డి ఈసారి ఎలాగైన గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి పోటీ చేస్తుందని జిల్లా నేతలు ప్రకటించారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ అభ్యంతరం తెలపడంతో పార్టీలో వివాదం మొదలైంది. సీనియర్ నేతలందరూ రేవంత్ ను విమర్శిస్తూ మా జిల్లా గురించి నీకేం తెలుసని, పద్మావతి రెడ్డినే బరిలోకి దించి గెలిపించుకుంటామంటున్నారు. జిల్లా నేతలందరూ పద్మావతి రెడ్డిని బలంగా ప్రతిపాదిస్తుండటంతో ఆమెనే అభ్యర్థిగా నిలుపుతారని కాంగ్రెస్ నేతలందరూ భావిస్తున్నారు.

అయితే టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతున్న శానంపూడి సైదిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఉత్తమ్ చేతిలో ఓడిపోయారన్న భావన ప్రజల్లో ఉండటంతో పాటు, సైదిరెడ్డికి చెందిన బంధువులు, మంత్రి జగదీశ్ రెడ్డి అండదండలు బలంగా ఉండటంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ పైట్ నడిచేట్లు కనిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో బలంగా పుంజుకుంటున్న బీజేపీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుని ఆయన సతీమణిని బరిలోకి దించాలని యత్నించింది. అయితే ఉన్నట్టుండి బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి చేరిక వాయిదా పడటంతో మరో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి నల్గొండ జిల్లాలో కాషాయ జెండాను రెపరెపలాడించాలని ఉవ్విళ్లూరుతుంది.

అందుకు తగ్గట్లు ప్లాన్ చేసిన రాష్ట్ర బీజేపీ అధిష్ఠానం జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిపై గురిపెట్టింది. రఘువీర్ రెడ్డిని బీజేపీలో చేర్చుకుంటే జానారెడ్డికి జిల్లాలో ఉన్న పట్టుతో పాటు ఆయన అండదండలు కొడుక్కి పనికి వస్తాయని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన రఘువీర్ రెడ్డి చివరి నిమిషంలో సీటు సంపాదించుకోలేక పోయారు. రఘువీర్ రెడ్డికి రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండటంతో ఆయన్ను చేర్చుకుంటే హుజూర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని ప్లాన్ చేస్తుంది. ఆర్థికంగా ఉన్న కుటుంబం కావడం, సాధారణ కార్యకర్తల నుంచి మంచి పరిచయాలు, జానారెడ్డి చరిష్మాతో పాటు మంచిగా చదువుకున్న వ్యక్తి కావడంతో రఘువీర్ రెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. రఘువీర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి ఓట్లు చీలిపోయి బీజేపీకి ప్లస్ అవుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరితే తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఓ రేంజ్ హీట్ పుట్టించడం ఖాయం.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

బీజేపీ కొత్త ప్లాన్, జానారెడ్డి కొడుక్కి గాలం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *