Top Ad unit 728 × 90

ఓ రాశివారికి ప్రతిష్ఠ పెరుగుతుంది!- ఏప్రిల్ 10 రాశి ఫలాలు

ఓ రాశివారికి ప్రతిష్ఠ పెరుగుతుంది!- ఏప్రిల్ 10 రాశి ఫలాలు

మేషం 
సన్నిహితుల కూటమిలో కొత్తవారిని చేరుస్తారు. సమిష్టిగా నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. లిఖితపూర్వక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటం ఉత్తమం. సుమంగళి పసుపు జలాలతో అమ్మవారికి అభిషేకం చేయండి. 

వృషభం 
మంచి ప్రోత్సాహం లభిస్తుంది. సకాలంలో స్పందించి సానుకూల ఫలితాలను సాధిస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న చాలా వ్యవహారాలను వ్యక్తిగత ప్రతిభతో చక్కదిద్దుతారు. వాహనం నడిపెటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నాగసింధూరం నుదుటున ధరించండి. నరదృష్టి తొలగుతుంది. 

మిథునం
భవిష్యత్తులో ఉపకరించే అంశాలపైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. వాహనం మార్పు చేసే సూచనలు ఉన్నాయి. విలువైన పత్రాలను అందుకుంటారు. ఆహార నియమాలను పాటిస్తారు. నాగబంధం ఉపయోగించండి. 

కర్కాటకం 
కృత్రిమంగా ఏర్పడే చికాకులు స్వల్పంగా ఇబ్బందిని కలిగిస్తాయి. గృహ మరమ్మత్తులు సాగిస్తారు. మయామాటలతో మిమ్మల్ని మోసపుచ్చే వారు మీ దగ్గరలోనే ఉంటారు. అష్టమూలికా తైలంతో తెల్ల జిల్లేడు వత్తులతో విఘ్నేశ్వరునికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. 

సింహ 
నత్తనడకన సాగుతున్న పనులలో చురుకుదనం తీసుకురావడానికి విశేషంగా శ్రమిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. వైద్యున్ని మార్పు చేస్తారు. స్వల్ప ధనలాభ సూచన. రోజూ అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. 

కన్య 
సంచలన నిర్ణయాలను తీసుకుంటారు. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. కొనుగోలు, అమ్మకాలు లాభిస్తాయి. ముందు జాగ్రత్తలతో వ్యవహరిస్తారు. ఆర్ధిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉన్నతమైన భావాలను కలిగి ఉంటారు. 

తుల 
రాజీలేని ధోరణిని కనబరుస్తారు. ధనానికన్నా ధర్మమే ముఖ్యమని భావిస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నఆత్మీయులను మందలిస్తారు. వాహన సంబంధమైన విషయాలకు ప్రతికూలం. త్రిశూల్ పొగ వేయడం వల్ల అన్ని విషయాలలో విజయప్రాప్తి కలుగుతుంది. 

వృశ్చికం 
ఆశ్చర్యం కలిగించే సమాచారాన్ని తెలుసుకుంటారు. అ పాత్రదానం చేస్తారు. దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొడతారు. సంతృప్తిని అలవరచుకుంటే జీవితం సుఖమయమవుతుంది. సర్వరక్షా చూర్ణంతో రోజూ స్నానమాచరించండి.(తలస్నానం వద్దు) 

ధనుస్సు 
నిష్కారణ ఈర్ష్యాద్వేషాలు అధికమవుతాయి. చిక్కబడిన ధనం చెతికంది వస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. పరిమళ గంధాన్ని పూజలో ఉపయోగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. 

మకరం 
కచ్చితంగా వ్యవహరిస్తారు. అధికార పరధి దృష్టిలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఓర్పు సహనం కలిగి ఉండడం చెప్పదగిన సూచన. ఖర్చులు మితిమీరి ఉంటాయి. సూర్యాష్టకం పారాయణ చేయండి. లక్ష్మీచందనంతో మీ ఇష్ట దైవానికి అభిషేకం చేయండి. 

కుంభం 
టెక్నికల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వాస్తవాలను పరిశీలించి వాటి ప్రాతిపదికగా నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త కార్యకమాలకు శ్రీకారం చుడతారు. లక్ష్మీతామరవత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధనచేయండి. 

మీనం 
ప్రయోజనాలు పదిలంగా పరిరక్షించుకుంటారు. శ్రమ అధికం కావడం వల్ల ఒత్తిడిని కలిగి ఉంటారు. లక్ష్మీచందనంతో ఇష్ట దైవానికి అభిషేకం చేయండి. ఋణ సంబంధమైన విషయాల నుంచి ఊపిరి పీల్చుకోగలుగుతారు. ప్రతిష్ఠ పెరుగుతుంది. 

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

ఓ రాశివారికి ప్రతిష్ఠ పెరుగుతుంది!- ఏప్రిల్ 10 రాశి ఫలాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *