మన రాజకీయ కపట ప్రేమ
మన రాజకీయ కపట ప్రేమ...!
ధృవపు ఎలుగుబంటి ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు ఉండరు. వాటిని ఎలా ఛంపుతారో తెలుసా...? రెండు వైపులా పదునుగా ఉండే ఒక కత్తికి రక్తం పూసి అవి తిరిగే ప్రాంతంలో వాటికీ కనిపించేలా భూమిలో పాతి పెడతారు. ఆ వాసనకు అవి ఆకర్షితులై ఆ రక్తాన్ని నాకుతూ ఉంటాయి. అలా నాకడం మొదలుపెట్టేసరికి వాటి నాలుక కూడా తెగి రక్తం కారడం మొదలవుతుంది. పాపం ఆ విషయం తెలియని ఎలుగుబంట్లు కత్తి నుండే వస్తుంది అని అలా నాకుతూనే ఉంటాయి. చివరికి నాలుక మొత్తం తెగిపోయి, వాటి రక్తం అయిపోయి చనిపోతాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందటే ఎన్నికల ముందు తాత్కాలికంగా ఇచ్చే ఉచిత నగదు, అవసరం లేని పధకాలు, ఇవన్నీ కూడా ఎర వేసే ఈ రక్తం పూసిన కత్తిలాంటివే. ఎప్పుడైతే వీటికి జనాలు ఆకర్షితులవుతారో వారికి తెలియకుండానే వారు కట్టే పన్నుల అనే రక్తాన్ని లాగేస్తూ ఎన్నికల సమయంలో కొంత చిల్లర వారికే ఇస్తూ చివరికి మొత్తం భిచ్చగాళ్ల ని చేసి ఎప్పటికీ అధికారంలో ఉండాలని వేసే దుర్మార్గపు ఎత్తుగడ. మీకు నిజంగా జనాల మీద ప్రేమ ఉంటే విసరాల్సింది చిల్లర కాదు, వాల్ల కాళ్ళ మీద వారు నిలబడెలా ఆత్మగౌరవంతో జీవించేలా ఆసరా. ఆది ఇవ్వని ఏ ప్రభుత్వం అయినా జనాలని ధృవపు ఎలుగుబంటిని వేటాడే సూత్రంలోనే చాలా తెలివిగా వారి జీవితాలతో ఆడుకోవడమే.
ప్రజలారా మేల్కొనండి, మేధావులారా ఆలోచించండి.
గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.
https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1
