Top Ad unit 728 × 90

చనిపోయిన ఆ డ్రైవర్ కు ఏడుగురు భార్యలు...!

చనిపోయిన ఆ డ్రైవర్ కు ఏడుగురు భార్యలు...! 

ఆ మహిళలు ఒకరికి మరొకరు తెలియక పోవడం పెద్ద ట్విస్ట్...?

హరిద్వార్ పోలీసులకు కలలో కూడా ఊహించని పరిణామం ఎదురైంది. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఒక వ్యక్తి మృతదేహం కోసం ఏడుగురు మహిళలు ఆందోళనకు దిగడమే దీనికి కారణం. తామందరం అతడి భార్యలమని చెప్పడంతో పోలీసులు మరింత విస్మయానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక రవిదాస్ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది.

అతని మృతదేహాన్ని ఇంటికి తరలించగా, భార్య తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అంతలో మరో ఆరుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. మా ఆయన అంటే మా ఆయన అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. డెడ్ బాడీని తమకంటే తమకు అప్పగించాలంటూ గొడవకు దిగారు. అక్కడున్న వారికి ఏమీ అర్థంకాక అలా చూస్తుండిపోయారు. ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్న వారు, పోలీసుల ఎంట్రీతో కాస్త తగ్గారు. వారందరినీ ఎలాగోలా శాంతపరిచాక, అతని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ గొడవపై అప్పుడే ఏమీ తేల్చలేమని, మరికొద్ది రోజులు ఆగాక మృతుడి భార్యలపై ఒక అవగాహన వస్తుందని పోలీసులు తెలిపారు. విశేషం ఏంటంటే ఆ మహిళలు ఒకరికి మరొకరు తెలియక పోవడం. ఆ వ్యక్తి జీవితంలో తామంతా భాగస్వాములమన్న విషయం ఆరోజే తెలియడం పెద్ద ట్విస్ట్.

గమనిక:- ఆసక్తికరమైన మరియు లేటెస్ట్ వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి.

http://www.youtube.com/c/PSLVTVNews?sub_confirmation=1

చనిపోయిన ఆ డ్రైవర్ కు ఏడుగురు భార్యలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *