Top Ad unit 728 × 90

కోతి కుతూహలం కొంప ముంచింది...!

అనగనగా ఒక అడవిలో కొంత మంది వడ్రంగులు పని చేసుకుంటున్నారు. వారు రోజు అడవిలో చెట్లు నరికి, చక్కలుగా కోసి వాటితో చక్కగా సామాను చేసుకుంటూ ఉండేవారు. మధ్యాహ్నం సమయంలో దగ్గర వున్న ఏటి గట్టు మీద కూర్చుని భోజనం చేసి, విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని ప్రారంభించేవారు.

ఒక రోజు అలాగే మధ్యాహ్నం అయ్యింది. అక్కడున్న వడ్రంగులలో ఒక్కరు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చక్కలు చేస్తున్నాడు. పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగ మళ్ళీ దగ్గర పడిపోతాయని మధ్యలో ఒక చెక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లి పోయాడు.

ఇంతలో అక్కడికి ఒక కోతుల గుంపు వచ్చింది. కోతులు వడ్రంగులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి. అందులో ఒక కోతి ఆ దుంగ, దుంగ మధ్యలో చీలిక చూసింది. కోతి ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు.

కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది. ఆ దుంగ మధ్యలో ఉన్న చెక్కను రెండు చేతులతో లాగింది. అలా లాగగానే చెక్క బయటికి వచ్చేసి, దుంగలో చేసిన చీలిక ఠక్కుమని దగ్గిరపడి మూసుకుపోయాయి.

అందులో కోతి తోక ఇరుక్కు పోయింది. కోతి గట్టి గట్టిగా అరవడం మొదలెట్టింది. భరించలేని నొప్పితో. ఆ శబ్దానికి మిగితా కోతులు భయ పడి పారి పోయాయి.

వడ్రంగులు ఆ అరుపులు విని చూడడానికి వచ్చి, కోతి చేసిన పని చూసారు. కోతి తోకను విడిపించారు.

పరిచయం లేని విషయాలలో ముక్కు దూర్చ కూడదని అందుకే పెద్దలు చెప్తారు.

ఇది అంతర్జాల సేకరణ

ముఖ్య గమనిక: వార్తలు, కథనాలు, భక్తి సమాచారం వ్రాయాలనుకున్తున్నారా...? మీ వివరాలను info@pslvtv.com OR pslvtv@gmail.com మెయిల్ చేయగలరు.

కోతి కుతూహలం కొంప ముంచింది...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *