Top Ad unit 728 × 90

నిజమే: బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె...!

నిజమే: బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె...!

 

Wiral Video: బలవంతమైన సర్పము చలి చీమల (Ants) చేత చిక్కి చావదె సుమతి, చిన్నప్పుడు చదువుకున్న ఈ సుమతి శతక పద్యం ఎప్పటికీ గుర్తుంచుకోదగినది. బలం ఉందని విర్రవీగితే ఎంతటి వారికైనా పరాభవం తప్పదని ఈ పద్యం నీతి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అంత పెద్ద కొండచిలువను (Python) ఓ చీమల దండు మాయం చేసింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కలిసికట్టుగా పోరాడితే ఎంత పెద్ద శత్రువును అయినా ఎదుర్కోవచ్చని చీమలు ఇస్తున్న సందేశం చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

 

@TheFigen అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. చీమలు ఉన్న ప్రాంతంలోకి ఓ కొండచిలువ ప్రవేశించింది. దీంతో ఆ కొండచిలువపై చీమలన్నీ కలిసి దాడికి దిగాయి. ఆ కొండచిలువను పై నుంచి కింద వరకు చీమలు చుట్టుముట్టాయి. ఈ చీమలను వదిలించుకోవడం కొండచిలువకు సాధ్యం కాలేదు. చివరకు ఆ చీమల దాడిలో ఆ కొండచిలువ హతమైంది. అత్యంత బలమైన కొండచిలువనే ఆ చీమలు చంపెయ్యడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ``ప్రకృతి మనకు చెప్పేది ఇదే, ఏ జీవినీ తక్కువగా అంచనా వేయకూడదు. ఒక జీవి కంటే ఓ సమూహం ఎప్పుడూ బలమైనది`` అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.8 కోట్ల మందికి పైగా వీక్షించారు. 82 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చీమలు ఎంత బలం ఉన్న వారినైనా ఇబ్బంది పెడతాయి``, ``ఐకమత్యమే మహబలమనే పాఠాన్నీ చీమల నుంచి నేర్చుకోవచ్చు``, ``చీమలు ఎంత పెద్ద పనిని అయినా కఠోర దీక్షతో పూర్తి చేస్తాయి``, ``చీమలు గొప్ప గురువులు, ఎన్నో విషయాలు నేర్పిస్తాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

 

నిజమే: బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *