Top Ad unit 728 × 90

బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తే ఏం చేయాలి

బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తే ఏం చేయాలి...!

బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తే ఏం చేయాలి. డబ్బులు ఎలా? ప్రత్నామ్నాయాలు ఏమున్నాయి మనకు…?

సాధారణ సెలవులతో పాటు ఉద్యోగ సంఘాల సమ్మెల కారణంగా ఈ శుక్రవారం నుంచి ఒక్క సోమవారం తప్ప బుధవారం వరకు 5 రోజుల పాటు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది.

ఈ నెల 21న అఖిలభారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓసీ) సమ్మెకు పిలుపునిచ్చింది. 22న నాలుగో శనివారం, 23న ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు దినాలు. సోమవారం 24 ఒక్కరోజు పనిచేసిన తర్వాత మళ్లీ 25న క్రిస్మస్ జాతీయ సెలవు వస్తుంది.

ఆ వెంటనే 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) సమ్మెకి పిలుపునిచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపడుతున్నారు.

ఇన్ని రోజులు వరుసగా బ్యాంకులు పనిచేయనప్పుడు ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటుంది.

బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేకుండా లావాదేవీలు జరిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేమిటి…?

ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా దుకాణాల్లో ఏ రోజైనా, ఎప్పుడైనా చెల్లింపులు చేసుకోవచ్చు.

ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చు. అయితే… వరుసగా 5 రోజులు సెలువులు రావడం వల్ల ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గుచూపడం ఉత్తమం.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నగదు రహితంగా 24 గంటలూ అనేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల కోసం మొబైల్ వాలెట్ యాప్‌లు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటితో బిల్లుల చెల్లింపులు, రీచార్జ్‌లు చేసుకోవచ్చు. కొన్ని యాప్‌లలో నగదు బదిలీ సదుపాయాలు కూడా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా నగదును బదిలీ చేసుకోవడం, దుకాణాల్లో చెల్లింపులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం యూపీఐతో అనుసంధానమై పనిచేసే మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్‌లు చాలా ఉన్నాయి.

డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఎక్కడైనా పడిపోతే, ఎవరైనా తస్కరిస్తే ఆ కార్డు పనిచేయకుండా వెంటనే బ్లాక్ చేసుకోవాలి. ప్రస్తుతం చాలావరకు బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డులను తమ మొబైల్ యాప్‌ల నుంచే బ్లాక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. కాబట్టి, మీకు ఖాతా ఉన్న బ్యాంకు యాప్‌లో అలాంటి సదుపాయం ఉందేమో చూసుకోవాలి. 24 గంటలూ పనిచేసే ఆయా బ్యాంకుల కస్టమర్ కేర్ నంబర్లకు ఫోన్ చేసి కూడా కార్డులను బ్లాక్ చేయించుకోవచ్చు.

ప్రస్తుతం పలు బ్యాంకులు నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అవి 24 గంటలూ పనిచేస్తుంటాయి. వాటిలో సాధారణ ఏటీఎంలతో పాటు, నగదు జమ చేసేందుకు వీలుగా సీడీఎం (క్యాష్ డిపాజిట్ మెషీన్లు) లు ఉంటాయి. వాటి ద్వారా ఎప్పుడైనా వెళ్లి తమ ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చు.

ఆదివారాలతో సహా అన్ని సెలవు దినాల్లోనూ ఐఎంపీఎస్ (తక్షణ చెల్లింపు సేవ) ద్వారా నగదును ఏ బ్యాంకు ఖాతాకు అయినా బదిలీ చేసుకునే వీలుంది. ఈ సేవలు రోజులో 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం భారత్‌లో పోస్టాఫీసుల్లోనూ బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి. కాబట్టి, బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో పోస్టాఫీసులు పనిచేస్తున్నాయోమో చూసుకోవాలి.

 

 

బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తే ఏం చేయాలి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *