Top Ad unit 728 × 90

ఇలాంటి విచిత్రమైన పండుగ ఎక్కడా చూసి ఉండరు...!

ఇలాంటి విచిత్రమైన పండుగ ఎక్కడా చూసి ఉండరు...!

మహబూబాబాద్: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పశుపక్ష్యాదులు క్షేమంగా ఉండాలని లంబాడ గిరిజనులు శీతల భవానీకి వారి సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించే దాతుడు పండుగను మహబూబాబాద్‌జిల్లాలో పలు తండాలో ఘనంగా నిర్వహించారు. వర్షాకాలం ఆరంభంలో ఆషాఢమాసంలో ఈ పండుగను నిర్వహిస్తారు. తండాల సమీపంలో ఉన్న శీతాల భవానీకి ప్రత్యేక మొక్కులు చెల్లించి నైవేద్యాన్ని సమర్పిస్తారు. వర్షాకాలంలో తమ వ్యవసాయానికి అనుబంధంగా ఉండే తమ పశుసంపదను గాలి, ధూళి జబ్బుల బారిన పడకుండా కాపాడాలని మేకపోతులు, పొట్టేళ్లు, కోళ్లను బలిస్తారు. బలి అనంతరం పొట్టేళ్ల పేగులను దారిపొడవున పరిచి వాటిపై పశువులను దాటిస్తారు.ఇలా దాటించడంవలన పశువులు ఎలాంటి జబ్బులబారిన పడకుండా ఉంటాయని వారి నమ్మకం. ఈ పండుగను గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. అందుకే ఈ పండుగ ప్రత్యేకతను విదేశీ ఛానళ్లు కూడా ప్రత్యేకంగా ప్రసారం చేశాయి. గిరిజన సంప్రదాయ రీతుల్లో ఓ వినూత్న నమ్మకానికి ఈ దాతుడి పండుగ గొప్ప ఉదాహరణ అని చెప్పాలి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఇలాంటి విచిత్రమైన పండుగ ఎక్కడా చూసి ఉండరు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *