Top Ad unit 728 × 90

తెలంగాణాలోనూ అలాంటి రాజకీయాలే...!

తెలంగాణాలోనూ అలాంటి రాజకీయాలే...!

1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన తరువాత 9 నెలల్లోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. అలా అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు అలంకరించారు. వారిలో తెరాస అధినేత కెసిఆర్ కూడా ఉన్నారు. బాబు, కెసిఆర్ ఇద్దరు ఇంచుమించుగా ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు.

అయితే, 1995 వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. 1994 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, పార్టీలో, ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి అజమాయిషి ఎక్కువ కావడంతో చంద్రబాబు నాయుడు మరికొంతమంది కలిసి ఎన్టీఆర్ ను ఆ పదవి నుంచి దించేశారు. బాబు ఆ సమయంలో చక్రం తిప్పి ముఖ్యమంత్రి అయ్యారు.

బాబు ముఖ్యమంత్రి అయ్యాక కొంతకాలానికి ఎన్టీఆర్ మరణించారు. కాలక్రమంగా చాలా మార్పులు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణాలో తెరాస పార్టీ అధికారంలోకి వచ్చింది. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి అయ్యాక హరీష్ రావును నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.

అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణాలో కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, హరీష్ రావుకు మాత్రం ఎలాంటి పదవిని ఇవ్వలేదు. హరీష్ రావును పక్కన పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటో ఇప్పటికి అర్ధం కావడం లేదు. హరీష్ రావును పక్కన పెట్టడం వెనుక ఏదైనా కుట్ర ఉన్నదా. హరీష్ రావును తొక్కేయ్యడానికి ప్లాన్ చేస్తున్నారా అన్నది తెలియాలి. హరీష్ రావుకు పల్లెటూరిలో మంచి పలుకుబడి ఉన్నది. గత ఎన్నికల్లో తెరాస పార్టీ విజయం సాధించడానికి హరీష్ రావు ఒక కారణం. అలాంటి హరీష్ రావును పక్కన పెడితె వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

తెలంగాణాలోనూ అలాంటి రాజకీయాలే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *