Top Ad unit 728 × 90

జనసేన ఎమ్మెల్యే అరెస్ట్... పవన్ స్పందన

జనసేన ఎమ్మెల్యే అరెస్ట్... పవన్ స్పందన

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన స్టేషన్ లో లొంగిపోయిన విషయం తెలుసుకుని జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజోలుకు చేరుకుంటున్నారు. దీంతో, రాజోలు పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే విషయం సీరియస్ కావడంతో ఈ అరెస్ట్ మీద జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజల తరఫున పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు కోరిన మీదటే వారికి మద్దతుగా రాపాక స్టేషన్ కు వెళ్లారని, అంతమాత్రానికే కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు.

నెల్లూరులో ఓ జర్నలిస్టుపై అధికార ఎమ్మెల్యే దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, చిన్న పాటి కేసులు పెట్టారని కానీ మలికిపురంలో గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చారని విమర్శించారు. ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా వెంటనే పరిష్కరించాలని, జనసేన కార్యకర్తలు కూడా సంయమనంతో వ్యవహరించాలని పవన్ సూచించారు. ఈ వ్యవహారంలో నెల్లూరు ఎమ్మెల్యేను వదిలేసి, జనసేన ఎమ్మెల్యేను మాత్ర,మే అరెస్ట్ చేసి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే, పరిస్థితి చేయి దాటుతుందని అప్పుడు మాత్రం తాను రంగంలోకి దిగుతానని జనసేనాని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు జిల్లా పార్టీ నేతలతో సమీక్షిస్తున్నానని తెలిపారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

జనసేన ఎమ్మెల్యే అరెస్ట్... పవన్ స్పందన Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *