Top Ad unit 728 × 90

ప్రభుత్వ ఆసుపత్రి లో పుట్టిన నాలుగురోజులకే చనిపోతున్న శిశువులు

ప్రభుత్వ ఆసుపత్రి లో పుట్టిన నాలుగురోజులకే చనిపోతున్న శిశువులు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చిన్నారుల మృత్యు ఘోష వినిపిస్తోంది. ముక్కు పచ్చలారని చిన్నారులకు పుట్టిన నాలుగురోజులకే వందేళ్లు నిండుతున్నాయి. లోకం చూడని పసికందుల రోదన అక్కడ సర్వ సాధారణమైంది. పుట్టీ పుట్టగానే మరణిస్తున్నారు. వారం రోజుల్లో 10 మంది శిశువులు చనిపోయారు. వెంటిలేటర్‌ సౌకర్యం లేకపోవడంతో మృతి చెందిన ఘటనలు జీ జీ హెచ్ లో సర్వ సాధారణమయ్యాయి. .

ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మంచి వైద్యం అందిస్తారని ఈ ఆసుప్రతికి పేరుంది. ఇన్ పేషేంట్, అవుట్ పేషేంట్ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మెరుగైన సౌకర్యాలు ఈ ఆసుపత్రిలో ఉన్నా రోగులు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సందర్భాలలో వైద్య సేవలు అందుబాటులో లేక రోగుల ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ కాన్పుల వార్డు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గర్బీణీలు, బాలింతలు బాధలు వర్ణనాతీతం. ఒక బెడ్‌పై ఇద్దరు బాలింతలు, ఇద్దరు శిశువులు. కాళ్ళు ముడుచుకునేందుకు వీలు లేదు. ఇదంతా కాన్పుల వార్డు లో బాలింతలు ఎదురు కొంటున్న సమస్య. నరకం అనుభవించడం తప్ప ఈ గోడు ఎవరికీ వెళ్ల బుచ్చినా తీరేది కాదు.

శిశువులు అనారోగ్యంతో పుట్టినా, బరువు తగ్గినా, వెంటనే వెంటిలేటర్‌లో ఉంచాలి. అయితే శిశువు ను బాక్స్ లో వేసే వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు డాక్టర్లు. అనంతరంవ చిన్నారుల బాధ్యత వదిలేస్తున్నారు. ఆ కారణంగానే వెంటిలేషన్ బాక్స్ లో ఉన్న శిశువులు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారం రోజుల్లో 10 మంది శిశువులు చనిపోయారు. తమకు కవల పిల్లలు జన్మిస్తే ఒకరిని వెంటిలేషన్ బాక్స్ లో ఉంచలేదని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఎలాగో వెంటిలేటర్‌లో ఉంచినా. శిశువు పరిస్థితి ఎలా ఉంది అని అడిగినా చెప్పేవారే లేరన్నారు. దీంతో చివరకు బిడ్డను కోల్పోయానని కన్నీళ్లపర్యంతమయ్యాడు.

దీనిపై వైద్యుల రియాక్షన్‌ మాత్రం విచిత్రంగా ఉంది. ఆసుపత్రిలో ఎలాంటి నిర్లక్ష్యం లేదంటున్నారు వైద్యులు. మీడియాని తప్పు దోవ పట్టిస్తున్నారంటున్నారు. వెంటిలేటర్‌లో ఉన్న శిశువుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు చూసుకుంటారని ఆసుపత్రి సూపరిండెంట్ రాజు నాయుడు చెబుతున్నారు.

ఈ ఆసుపత్రిలో వైద్యం అంత ఫర్‌ఫెక్ట్‌గా జరిగితే. శిశువులు ఎందుకు మరణిస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం డాక్టర్ల దగ్గర సమాధానం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఆసుపత్రి లో శిశువులకోసం ఏర్పాటు చేసిన వెంటిలేషన్ బాక్స్ సిస్టం బాగా పని చేయాలంటున్నారు తల్లిదండ్రులు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ప్రభుత్వ ఆసుపత్రి లో పుట్టిన నాలుగురోజులకే చనిపోతున్న శిశువులు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *