Top Ad unit 728 × 90

ఎమ్మెల్సీ అభ్యర్ధులకు కొత్త చిక్కులు...!

ఎమ్మెల్సీ అభ్యర్ధులకు కొత్త చిక్కులు...!

ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఆ నేతలకు కొత్త చిక్కొచ్చిపడింది. మూడేళ్ల పదవి కోసం పోటీ పడుతున్న నేతలకు.. ఖర్చు ముచ్చెమటలు పడుతున్నాయి. ఓ వైపు పదవికోసం ఆరాటం.. మరోవైపు భారీ ఖర్చుతో చెలగాటం అన్నట్లుంది అభ్యర్ధులకు! పదవి కాలం అయిపోతున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఓటర్లు పెద్ద ఆశలతో ఉండటంతో.. వారిని తమవైపు తిప్పుకునేందుకు ఎమ్మెల్సీ అభ్యర్దులు పడరాని పాట్లు పడుతున్నారు.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు అభ్యర్దులను ప్రకటించాయి. మూడేళ్ల పాటు అధికారంలో ఉండే ఎమ్మెల్సీ పదవికోసం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడి అభ్యర్దులను ప్రకటించాయి. మూడు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న లక్ష్యంగా.. పార్టీలు.. అర్దికంగా బలమైన అభ్యర్దులను బరిలో నిలిపాయి. అయితే ఎన్నికల ఖర్చు విషయంలో ఓ అంచనాకు రాలేక పోతున్నారు అభ్యర్ధులు.

ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిసియో సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా లో 1086, వరంగల్ జిల్లాలో 902, రంగారెడ్డి జిల్లాలో 812మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎంపీటీసీ ఓటర్లే అత్యధికం. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవికాలం జులై ఏడున ముగుస్తోంది. వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఇదే చివరి అవకాశం. దీంతో వీరంతా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇదే ఛాన్స్‌గా ఓటు వేసేందుకు భారీగా డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. డబ్బు ప్రభావం అధికంగా ఉన్నా.. మెజార్టీ ఓటర్లు తమను ఆదరించే వాళ్లకే ఓటు వేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి.

గతంలో నల్గొండ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తేరా చిన్నప రెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడ్డారు.ఇరువర్గాలు క్యాంపు రాజకీయాలు నిర్వహించినా చివరకు కోమటి రెడ్డినే విజయం వరించింది. ఈసారి టీఆర్ఎస్ నుంచి మళ్లీ తేరా చిన్నపరెడ్డి రంగంలో ఉండగా అటు కాంగ్రెస్ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ బరిలో దిగారు. ఇక రంగారెడ్డిలో సేమ్ సీన్ రిపీట్ అయింది. గతంలో పట్నం మహేందర్ రెడ్డి తమ తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించుకోగా.ఈసారి తానే రంగంలో ఉన్నారు. అటు గతంలో ఉమ్మడి వరంగల్ల్ జిల్లా కొండా మురళి లోకల్ బడీ ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా గెలిచారు. కొండా మురళి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి మారడంతో.. పోచంపల్లి. శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఎట్టి పరిస్థితుల్లోనే పోచంపల్లిని గెలిపించాలని కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఇక్కడ పోచం పల్లికి పోటీగా ఇనగాల వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బరిలో నిలిపారు. నామినేషన్ల పర్వం ముగియయడంతో ఇక క్యాంపు రాజకీయాలకు నేతలు తెరలేపనున్నాయి ప్రధాన పార్టీలు. ఈ ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా ఉంటుందని ముందే ఊహించిన రాజకీయ పార్టీలు బిగ్ షాట్స్‌ను రంగంలో దించాయి. తమ అభ్యర్దులు గెలుపుకోసం ఎందాకైన వెళ్లేందుకు రెడీ అయ్యాయి. జరిగేవి ఎమ్మెల్సీ ఎన్నికలైనా ఎమ్మెల్యే ఎన్నికలంటే ఎక్కవ ఉత్కంఠ రేపుతున్నాయి.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఎమ్మెల్సీ అభ్యర్ధులకు కొత్త చిక్కులు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *