రెండు రోజులు భారీ వానలు...!
రెండు రోజులు భారీ వానలు... ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఖమ్మం జిల్లా గంగారంలో అత్యధికంగా 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడు, మద్దుకూరులో 7.9 సెంటమీటర్లు, మహబూబాద్ జిల్లా బయ్యారంలో 7.5, భద్రాద్రి జిల్లా నాగుపల్లిలో 7.4, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు, మహబూబాబాద్‌లో 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, జనగామ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లోనూ వర్షం కురిసింది.