Top Ad unit 728 × 90

మూడు దశల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు తేదీలు ఇవేనా

మూడు దశల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు తేదీలు ఇవేనా

 

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై చాలా కాలంగా ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే పంచాయతీ పాలకవర్గాల కాల పరిమితి ముగిసి ఆరు నెలలు దాటడంతో, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

 

దీనిలో భాగంగానే ఇప్పటికే అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల పైన ఆయన చర్చించారు. వీలైనంత త్వరగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. తెలంగాణలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ 21, 25 , 30 తేదీలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఈ మేరకు అధికారులు ఎన్నికలు నిర్వహించే తేదీలు, ఓటర్ల జాబితా, ప్రస్తుత పరిస్థితి వంటి అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు.

 

వారం రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లడంతో, ఆయన తిరిగి వచ్చేసరికి పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై ఒక క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. రేవంత్ ఆదేశాలు రాగానే ఎన్నికలకు సంబంధించి కసరత్తు మొదలు పెట్టాలని, ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. సెప్టెంబర్ లో ఎన్నికలు కు వెళ్లేందుకు వీలవుతుందా లేదా అనే అంశం పైన పంచాయతీరాజ్ శాఖ అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ సర్పంచ్ ల పదవీకాలం ఫిబ్రవరి 2న ముగిసింది .దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనను ప్రవేశపెట్టింది.

 

అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికలు ఇప్పటికే నిర్వహించాల్సి ఉండగా, ప్రభుత్వం దానిని వాయిదాలు వేస్తూ వస్తోంది. అయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ తర్వాత గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తే తమకు కలిసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో రుణమాఫీ చేయడం, ఆగస్టు నెల చివరి నాటికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో, ఈ తంతు ముగిసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారట.

 

మూడు దశల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు తేదీలు ఇవేనా Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *