Top Ad unit 728 × 90

జయరాం హత్య కేసులో రాకేష్‌రెడ్డిని హంతకుడిగా నిర్ధారించారు

జయరాం హత్య కేసులో రాకేష్‌రెడ్డిని హంతకుడిగా నిర్ధారించారు...!

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మిస్టరీ వీడింది. రాకేష్‌రెడ్డిని హంతకుడిగా పోలీసులు నిర్ధారించారు. కిరాయి హంతకులతో జయరాంను హత్య చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో ఐదుగురిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాంను హైదరాబాద్‌లోనే చంపేసి మృతదేహాన్ని కంచికచర్ల వద్ద పడేసినట్లు తేల్చారు. రాకేష్‌రెడ్డి వద్ద తీసుకున్న రూ. 4.5కోట్ల అప్పే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి, రెండు రోజులుగా దర్యాప్తు చేపట్టారు. సెల్‌సిగ్నల్స్ ఆధారంగా కేసు మిస్టరీని చేధించారు. జయరాంను హైదరాబాద్‌లోనే హత్య చేసి, ఆపై మృతదేహాన్ని కృష్ణాజిల్లా కంచికచర్లకు తీసుకువచ్చారు. జయరాం తలకు బలమైన గాయమైనట్లు చిత్రీకరించేందుకు బీర్‌ బాటిల్‌తో తలపగులగొట్టి, కారులోని వెనుక సీట్లో మృతదేహాన్ని ఉంచి కారును పక్కకు నెట్టేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సాయంత్రం పోలీసులు మీడియాకు వెల్లడించనున్నారు.

మరోవైపు ఈరోజు హైదరాబాద్‌లో జయరాం అంత్యక్రియలు జరుగనున్నాయి. అమెరికా నుంచి జయరాం కుటుంబసభ్యులు నగరానికి చేరుకున్నారు.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

జయరాం హత్య కేసులో రాకేష్‌రెడ్డిని హంతకుడిగా నిర్ధారించారు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *