Top Ad unit 728 × 90

తాడిపత్రిలో జేసీ వారసులపై..నగరిలో రోజాపై..ఏపీలో జోరుగా..

తాడిపత్రిలో జేసీ వారసులపై..నగరిలో రోజాపై..ఏపీలో జోరుగా..

ఎన్నికల బెట్టింగ్ లో పవన్, లోకేష్ హాట్ స్టార్లుగా భావిస్తున్నారు పందెంరాయుళ్లు. జనసేన గెలుచుకోనే సీట్లపై కూడా కోట్ల బెట్టింగ్ కు దిగుతున్నారు. బాలకృష్ణ, రోజా, జేసీ, కోడెలపై కూడా పందెం జోరుగా జరుగుతోంది.

తొలిసారి ఎన్నికల బరిలో నిలుచున్న జనసేనపై బెట్టింగ్ కు తగ్గటం లేదు పందెంరాయుళ్లు. జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందనే అంశంపై జోరుగా పందెం జరుగుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఎన్ని సీట్లు వస్తాయి? మొత్తంగా ఏపీలో ఎన్ని సీట్లు గెలుస్తుంది.? అన్నయ్య చిరంజీవి ఆధ్వర్యంలో పీఆర్పీ సాధించిన సీట్ల కంటే జనసేన ఎన్ని సీట్లు సాధిస్తుందనే లెక్కలపై బెట్టింగ్ భారీగా జరుగుతోంది. ఒక్క జనసేన టాపిక్ చుట్టే 48 గంటల్లో దాదాపు 200 కోట్ల వరకు బెట్టింగ్ జరగిందని అంచనా.

ఇక అభ్యర్ధుల వారిగా చూసుకుంటే పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ, జేడీ లక్ష్మినారాయణతో పాటు తాడిపత్రిలో జేసీ వారసులు, నగరిలో రోజా మీద బెట్టింగ్ లు ఊపందుకుంటున్నాయి. భీమవరం, గాజువాకలో పోటీ చేస్తున్న పవన్ రెండు చోట్ల విజయ సాధిస్తారా? ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఒకే చోట గెలిస్తే ఎంత మెజారిటీ. అది ఎక్కడ గెలుస్తారు? ఇలా పవన్ పై బెట్టింగ్ కాసేందుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక మంగళగిరిలో వైసీపీ అభ్యర్ధి ఆర్కేపై పోటీ చేస్తున్న లోకేష్ పై కూడా భారీగా పందెం కాస్తున్నారు. తొలిసారిగా పోటీ చేస్తున్న లోకేష్ మెజారిటీపై పాతిక లక్షల వరకు బెట్టింగ్ పెడతున్నారు. ఇక హిందూపురంలో బాలకృష్ణ గెలుపోటములపైనా పందెం నడుస్తోంది. జనసేన నుంచి బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ విశాఖలో విజయం సాధిస్తారా? టీడీపీ అభ్యర్ధి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ గెలుస్తారా? అని లక్ష నుంచి పది లక్షల వరకు బెట్టింగ్ కాస్తున్నారు.

నిజానికి పోలింగ్ కు ముందే ఏపీలో బెట్టింగ్ ఊపందుకుంది. పోల్ పర్సెంటేజీలపై పందెం కాశారు. ఎవరికి ఎక్కడ టికెట్ వస్తుంది.. ఏ నియోజక వర్గంలో ఎంత పోలింగ్ నమోదవుతుందనే పాయింట్తో పందెం నడిచింది. ఇక ఇప్పుడు ఫలితాలపై బెట్టింగ్ ఊపందుకుంది. ఓవరాల్ మెజారిటీతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది? జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? జిల్లాలోని కీలక నేతలు గెలుస్తారా? గెలిస్తే మెజారిటీ ఎంత సాధిస్తారు? ఇలా ప్రతీ అంశంపైనా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పాతిక వేల నుంచి పాతిక లక్షల వరకైనా ఓకే రెడీ అంటున్నారు. చివరికి చేపల చెరువులు.. భూములు. పొలాలు.. స్థిర, చరాస్థుల వరకు బెట్టింగ్ రింగులోకి లాగేశారు. ఎన్నికల ఫలితాలపై ఏపీలో దాదాపుగా 2500 నుంచి 3000 కోట్ల వరకు బెట్టింగ్ జరగొచ్చని అంచనా.

ఏపీలో ఇలా ఉంటే… కర్నాటకలోనూ పందెం రాయుళ్లు… సై అంటున్నారు. బెంగళూరు కేంద్రంగా… వందల కోట్ల బెట్టింగ్ లు నడుస్తున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ విజయంపై తెలుగు వారితోపాటు కన్నడీగులు కూడా భారీగా పందెం కాస్తున్నారు. అటు అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులు కూడా డాలర్లలో పందాలు కాస్తున్నారు. సప్త సముద్రాలు దాటి… ఖండాంతర కీర్తి ఉన్న తెలుగు ఖ్యాతి ఇప్పుడు అదే రేంజ్ లో బెట్టింగ్ రూపంలో కూడా ఫేమస్ కావడం విశేషం. మరి ఈ పందెంలో విజయం ఎవరిని వరిస్తుంది. మరెవరిని అపజయం దరిచేరుతుంది. చూడాలి…

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

 

తాడిపత్రిలో జేసీ వారసులపై..నగరిలో రోజాపై..ఏపీలో జోరుగా.. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *