ఏపీలోని ప్రతి జిల్లాకూ రూ. 5 కోట్లు కేటాయింపు - సీఎం చంద్రబాబు
ఏపీలోని ప్రతి జిల్లాకూ రూ. 5 కోట్లు కేటాయింపు - సీఎం చంద్రబాబు
ప్రతి జిల్లాకూ చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి రూ. 5 కోట్లను కేటాయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. నియోజకవర్గ స్థాయిలో గంజాయి నివారణ మీద సమీక్షలు చేపట్టాలని సూచించారు మంత్రి నాదెండ్ల.
ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు సూచనలు చేశారు. గంజాయి విషయంలో హాట్ స్పాట్స్ ఆఫ్ ప్రొడెక్షన్... హాట్ స్పాట్స్ ఆఫ్ కన్సప్షన్ అనేది ఐడెంటిఫై చేయాలని ఆదేశించారు చంద్రబాబు.
గంజాయి నెట్ వర్క్‌ను డిస్ కనెక్ట్ చేయాలని... ముందుగా గంజాయి సాగు జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పక్క రాష్ట్రం నుంచి గంజాయి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు చంద్రబాబు. సైబర్ సెక్యూర్టీ విషయంలో పటిష్టంగా చర్యలు తీసుకోవాలని... సైబర్ క్రైమ్ విషయంలో ప్రజలను చైతన్యపర్చాలని స్పష్టం చేశారు చంద్రబాబు. ప్రతి జిల్లాకూ చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి రూ. 5 కోట్లను కేటాయిస్తామన్నారు చంద్రబాబు.