Top Ad unit 728 × 90

ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఆ స్నేహితురాళ్ళు ఇద్దరు

ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఆ స్నేహితురాళ్ళు ఇద్దరు...! 

వారిద్దరూ స్నేహితులు... ఒకరి నుంచి మరొకరు దూరం కావడాన్ని తట్టుకోలేకపోయారు. చనిపోతున్నట్లు లేఖ రాసిపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఎటు వెళ్లారో, ఏమైపోయారో తెలీదు. పోలీసు దర్యాప్తు ఫలించడంతో వారిద్దరూ తల్లిదండ్రుల వద్దకు చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చిన్నకొండూరుకు చెందిన శ్రావణి (17), రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌కు చెందిన రేష్మా(18) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో గతేడాది ఇంటర్‌ చదివారు. తర్వాత రేష్మాను ఆమె తల్లిదండ్రులు నల్గొండలోని డీఈడీ కళాశాలలో చేర్పించారు. దీంతో ఆ యువతులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. గతనెల 31న ఆరోగ్యం బాగోక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు నోటు రాసిపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయిన శ్రావణి, రేష్మా వద్దకు చేరింది.

ఇద్దరూ కలిసి పానగల్‌లోని ఉదయ సముద్రం జలాశయానికి చేరారు. అనారోగ్య కారణంగా బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు రేష్మా లేఖ రాసిపెట్టింది. బ్యాగు, చెప్పులు, దుస్తులు జలాశయం వద్దే వదిలి రైల్వేస్టేషన్‌కు చేరుకుని గుంటూరు వైపు వెళ్లారు, తర్వాత విజయవాడకు, అక్కడి నుంచి చెన్నైకి, తర్వాత ముంబయికి, ఆపై గుజరాత్‌లోని వడోదరాకు వెళ్లారు. వసతి దొరక్కపోవడంతో సోమవారం తిరిగి విజయవాడ చేరుకున్నారు. పోలీసులు రేష్మాతో పాటే వసతిగృహంలో ఉంటున్న మరో విద్యార్థినిని విచారించి వివరాలు రాబట్టారు. ఎట్టకేలకు విజయవాడలో యువతులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఆ స్నేహితురాళ్ళు ఇద్దరు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *