Top Ad unit 728 × 90

రికార్డు కోసం 10న అన్నమయ్య సంకీర్తనల ఆలాపన

రికార్డు కోసం 10న అన్నమయ్య సంకీర్తనల ఆలాపన...!

అన్నమయ్య సంకీర్తనలను స్త్రీ కంఠంతో అయిదు గంటలపాటు నిర్విరామంగా ఆలపించి అంతర్జాతీయ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు నెలకొల్పే కార్యక్రమాన్ని ఈ నెల 10న నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గాయకుడు దీక్షితులు సుబ్రహ్మణ్యం తెలిపారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ డీడీ కాలనీలో శ్రీషిర్డీ సాయిబాబా సంస్థానంలోని మొదటి అంతస్తులో నిర్వహిస్తున్నట్లు ఆదివారం డీడీ కాలనీలోని సాయిబాబా ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన తాను స్త్రీ కంఠంతో అన్నమయ్య కీర్తనల శీర్షికన అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

కార్యక్రమం 10వ తేదీన ఉదయం 9.30 నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు బింగి నరేందర్‌గౌడ్‌, జి.స్వర్ణశ్రీతోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గానప్రియులు పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు. సమావేశంలో శ్రీషిర్డీసాయిబాబా సంస్థాన్‌ అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.వి.సాయికృష్ణ, వయోలిన్‌ మాస్టర్‌ ధనుంజయ, తదితరులు పాల్గొన్నారు.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

రికార్డు కోసం 10న అన్నమయ్య సంకీర్తనల ఆలాపన Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *