Top Ad unit 728 × 90

అతనికి ఇంకా పెళ్ళి కాలేదు అని, కో యాంకర్స్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడని

అతనికి ఇంకా పెళ్ళి కాలేదు అని, కో యాంకర్స్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడని...! 

బుల్లితెరపై పలు టీవీ షోలకి వ్యాఖ్యాతగా అలరిస్తూ అడపాదడపా వెండితెరపై కథనాయకుడిగా అలరిస్తూ వస్తున్నాడు రవి. ఇది మా ప్రేమ కథ అనే చిత్రంతో ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే తన వాక్‌చాతుర్యంతో వినోదాన్ని పంచే రవిపై వచ్చే పుకార్లు అన్నీ ఇన్నీ కావు. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు అని, కో యాంకర్స్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడని సోషల్ మీడియాలో విపరీతమైన పుకార్లు షికారు చేసేవి. ఈ నేపథ్యంలో రవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ గాసిప్ రాయుళ్ళకి పూర్తి క్లారిటీ వచ్చేలా చేసింది. చర్చి నుండి తన భార్య, కూతురితో కలిసి వస్తున్న ఫోటోని షేర్ చేసిన రవి... "సక్సెస్ ఫుల్ మ్యాన్ కన్నా ఫ్యామిలీ మ్యాన్" చాలా సంతోషంగా ఉంటాడు అని కామెంట్ పెట్టాడు. తన భార్య పేరు నిత్య, మూడేళ్ల కూతురి పేరు వియా అని కూడా నెటిజన్స్‌కి తెలిపాడు. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే పెళ్లి అయి చాలా రోజులే అవుతున్న ఇంత వరకు వాళ్ళ ఫ్యామిలీని ఏనాడు పరిచయం చేయలేదు రవి. కాని ఉన్నట్టుండి ఇప్పుడు తన భార్య, కూతురిని ఎందుకు పరిచయం చేశాడా అని నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

అతనికి ఇంకా పెళ్ళి కాలేదు అని, కో యాంకర్స్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడని Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *