Top Ad unit 728 × 90

వైజాగ్‌ టెస్టుకు వాన గండం

వైజాగ్‌ టెస్టుకు వాన గండం

విశాఖపట్నం: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం నుంచి జరిగే తొలి టెస్టు సజావుగా సాగడం సందేహంగానే మారింది. ఎందుకంటే ఆట జరిగే ఐదు రోజులూ వర్షం ఆటంకపరచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి గత ఐదు రోజుల నుంచి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్‌ తొలి రోజు కూడా 80శాతం వర్షానికి చాన్స్‌ ఉండడం అభిమానులను ఆందోళనపరుస్తోంది. ఆ తర్వాతి రెండు రోజులు 50 నుంచి 40 శాతం వర్షం కురవవచ్చట. ఇక చివరి రెండు రోజులుకూడా పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. మరోవైపు విజయనగరంలో జరిగిన మూడు రోజుల వామప్‌ మ్యాచ్‌ కూడా తొలి రోజు వర్షార్పణమైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం భారీ వర్షం కురిసినా నిర్వాహకులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి వీడీసీఏ-బీ గ్రౌండ్‌ను నెట్‌ ప్రాక్టీ్‌సకు అనువుగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సాధన చేశారు. మధ్యాహ్నం నుంచి భారత ఆటగాళ్లు చెమటోడ్చారు. కాగా మ్యాచ్‌ ఏర్పాట్లను నిర్వాహక కమిటీ సభ్యులు సోమవారం సాయంత్రం పరిశీలించారు. కలెక్టర్‌ వినయ్‌చంద్‌, పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా, ఆంధ్ర క్రికెట్‌ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఏర్పాట్లను పరిశీలించారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

వైజాగ్‌ టెస్టుకు వాన గండం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *