Top Ad unit 728 × 90

అంతర్జాతీయ పర్యటనలకు తెలుగు క్రికెటర్లు

అంతర్జాతీయ పర్యటనలకు తెలుగు క్రికెటర్లు

న్యూఢిల్లీ: భారత్‌-ఎ జట్లకు తెలుగు కుర్రాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, హనుమ విహారి, కేఎస్‌ భరత్‌, రికీ భుయ్‌ ఎంపియ్యారు. జూలై 11 నుంచి మొదలయ్యే వెస్టిండీస్‌ పర్యటనలో భారత్‌-ఎ ఐదు వన్డేలు, మూడు అనధికార టెస్టు (నాలుగు రోజుల)లు ఆడనుంది. హైదరాబాద్‌కు చెందిన పేసర్‌ సిరాజ్‌, ఏపీ ఆటగాడు కేఎస్‌ భరత్‌ టెస్టు జట్టులో చోటుదక్కగా.. రిషభ్‌ పంత్‌ను వన్డేలకు సెలెక్టర్లు ఎంపిక చేశారు. కాగా, పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారిలకు వన్డే, టెస్టు జట్లలో స్థానం లభించింది. గాయం నుంచి కోలుకున్న టెస్టు రెగ్యులర్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు టెస్టు జట్టులో చోటుదక్కింది.

టెస్టులకు శ్రేయాస్‌ అయ్యర్‌ నేతృత్వం వహించనుండగా.. వన్డేలకు మనీష్‌ పాండేకు కెప్టెన్సీ అప్పజెప్పారు. అశ్విన్‌, పుజారా, రహానె, ఉమేష్‌ యాదవ్‌లను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వారు కౌంటీ క్రికెట్‌ ఆడే అవకాశాలున్నాయి. కాగా, ఈనెల 25 నుంచి శ్రీలంక-ఎతో జరిగే సిరీస్‌ కూడా భారత జట్టును ప్రకటించారు.

బెలగావి, హుబ్లీలో జరిగే రెండు అనధికార టెస్టులకు ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్సీ వహించనున్నాడు. జూన్‌ 6 నుంచి జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు ప్రియాంక్‌ పాంచల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఆటగాడు రికీ భుయ్‌కి రెండు ఫార్మాట్లలో చోటు దక్కింది. కేఎస్‌ భరత్‌ వన్డేలు ఆడనున్నాడు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

అంతర్జాతీయ పర్యటనలకు తెలుగు క్రికెటర్లు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *