Top Ad unit 728 × 90

ఫ్లాష్‌బ్యాక్‌ బాధను దిగమింగి...!

ఫ్లాష్‌బ్యాక్‌ బాధను దిగమింగి...!

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వంద సెంచరీలు బాదినా... 1999 ప్రపంచకప్‌లో చేసిన శతకం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చిన ఆ ప్రపంచక్‌పలో బ్రిస్టల్‌ వేదికగా కొట్టిన సెంచరీ మాస్టర్‌తో పాటు అభిమానుల మది నుంచి ఎన్నటికీ చెరిగిపోనిదని చెప్పుకోవచ్చు. ఈ టోర్నీలో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు తండ్రి మరణించడంతో సచిన్‌ స్వదేశం తిరిగొచ్చాడు. సచిన్‌ గైర్హాజరీలో జింబాబ్వేతో ఆడిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి పాలైంది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత సచిన్‌ వెంటనే ఇంగ్లండ్‌ వచ్చి జట్టుతో చేరాడు.

కెన్యాతో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో సచిన్‌ ఏకంగా సెంచరీతో విజృంభించాడు. 101 బంతుల్లో 141 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బలహీనమైన జట్టే కావొచ్చు.. కానీ, తండ్రి లేడన్న బాధను దిగమింగుకుంటూ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సచిన్‌ శతకం సాధించడమంటే ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ మ్యాచ్‌లో సెంచరీ చేయగానే, తండ్రిని గుర్తు చేసుకుంటూ సచిన్‌ బ్యాట్‌ను ఆకాశం వైపు చూపించడం ఇప్పటికీ మరిచిపోలేం. ఆ తర్వాత సచిన్‌ సెంచరీ కొట్టిన ప్రతిసారీ బ్యాట్‌ను ఆకాశం వైపు చూపించడం అలవాటుగా చేసుకున్నాడు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ఫ్లాష్‌బ్యాక్‌ బాధను దిగమింగి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *