Top Ad unit 728 × 90

రాత్రంతా ఆసుపత్రిలో... ఉదయాన్నే మెరుపు సెంచరీ...

రాత్రంతా ఆసుపత్రిలో... ఉదయాన్నే మెరుపు సెంచరీ...

ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ కు పాక్ తో జరగబోయే నాలుగో వన్డేకు ముందు ఓ పెద్ద విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నాడు. వివరాళ్లోకెళితే.. అనారోగ్యంతో రాయ్ కుమార్తె ఆసుపత్రిలో చేరింది. దీంతో భార్యతో కలిసి రాయ్ ఆమెను చూసుకుంటూ రాత్రంతా ఆసుపత్రిలో గడిపాడు. దాదాపు ఏడు గంటలపాటు కుమార్తెతోనే ఉన్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయాడు.

అయితే, మైదానంలో అడుగుపెట్టిన రాయ్ బంతి కనిపించడంతోనే చెలరేగిపోయాడు. నిద్రమత్తు, అలసట దరిచేరకుండా జాగ్రత్త పడ్డాడు. సెంచరీ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు.89 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 114 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో గెలుచుకుంది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

రాత్రంతా ఆసుపత్రిలో... ఉదయాన్నే మెరుపు సెంచరీ... Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *