Top Ad unit 728 × 90

డెబ్యూ మ్యాచ్ లోనే రియాన్ పరాగ్ భారీ రికార్డ్!

డెబ్యూ మ్యాచ్ లోనే రియాన్ పరాగ్ భారీ రికార్డ్! తొలి ఇండియన్ ప్లేయర్ గా.

 

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 110 పరుగుల భారీ తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. దాంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కోల్పోయింది. ఇక ఈ సిరీస్ విజయంతో 27 సంవత్సరాల తర్వాత భారత్ పై సిరీస్ గెలిచి చరిత్రను తిరగరాసింది శ్రీలంక.

 

ఇక ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు యంగ్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్. బౌలింగ్ లో 9 ఓవర్లు వేసి 54 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఓ భారీ రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు. పైగా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ బౌలర్ గా చరిత్రపుటల్లోకి ఎక్కాడు.

 

రియాన్ పరాగ్... ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఓవరాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా అతడి ఆటతీరులో బిహేవియర్ లో పూర్తిగా మార్పు వచ్చింది. పైగా గత ఐపీఎల్ లో పరుగుల వరదపారించాడు రియాగ్. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. దాంతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్ లోనే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ ఘనత ఏంటంటే?

 

శ్రీలంక ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 96 పరుగులు చేసి, సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 36వ ఓవర్ వేయడానికి వచ్చాడు పరాగ్. ఈ ఓవర్ 3వ బంతికి ఎల్బీ రూపంలో ఫెర్నాండోను పెవిలియన్ చేర్చాడు పరాగ్. దాంతో వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్ లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ని ఫస్ట్ వికెట్ గా ఔట్ చేసిన తొలి ఇండియన్ బౌలర్ గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. ద్రవిడ్ 1999లో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్ సయ్యద్ అన్వర్ ను 95 పరుగుల స్కోర్ వద్ద ఔట్ చేశాడు. ఇది ద్రవిడ్ కు వన్డేల్లో తొలి వికెట్. ఈ జాబితాలో మూడో స్థానంలో ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. అతడు 2018లో హాంకాంగ్ బ్యాటర్ నిజాకత్ ఖాన్ ను 92 పరుగుల వద్ద పెవిలియన్ చేర్చాడు. ఇక తన డెబ్యూ మ్యాచ్ లోనే 3 వికెట్లు తీసి సత్తా చాటాడు పరాగ్. అర్షదీప్ సింగ్ స్థానంలో ఇతడు జట్టులోకి వచ్చాడు. మరి తొలి మ్యాచ్ లోనే ఇంతటి భారీ రికార్డు నెలకొల్పిన రియాన్ పరాగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

డెబ్యూ మ్యాచ్ లోనే రియాన్ పరాగ్ భారీ రికార్డ్! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *