చరిత్ర సృష్టించిన జో రూట్, తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్…!
చరిత్ర సృష్టించిన జో రూట్, తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్…!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో తన జోరును కొనసాగిస్తున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఈ ఫీట్ సాధించాడు.
ఓలీ పోప్ డకౌటవ్వడంతో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జోరూట్(32 బ్యాటింగ్) ఆచితూచి ఆడి 27 పరుగుల స్కోర్ వద్ద ఈ ఘనతను అందుకున్నాడు. 2019లో డబ్ల్యూటీసీ ప్రారంభమవ్వగా… జోరూట్ 59 మ్యాచ్‌లు ఆడి 16 సెంచరీలతో 20 హాఫ్ సెంచరీలతో 5005 పరుగులు చేశాడు.
డబ్ల్యూటీసీలో జోరూట్ తర్వాత 4 వేలు పరుగులు చేసిన బ్యాటర్లు కూడా లేరు. ఈ జాబితాలో జోరూట్(5005) టాప్‌లో ఉండగా, మార్నస్ లబుషేన్(3904), స్టీవ్ స్మిత్(3486), బెన్ స్టోక్స్(3101), బాబర్ ఆజామ్(2755) ఉన్నారు. డబ్ల్యూటీసీ అరంగేట్ర ఎడిషన్‌లో జోరూట్ 1660 పరుగులతో సెకండ్ హయ్యెస్ట్ రన్ గెట్టర్‌గా నిలిచాడు. లబుషేన్ 1675 పరుగులతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
డబ్ల్యూటీసీ 2021-23 ఎడిషన్‌లో 1915 పరుగులతో టాప్‌లో నిలిచి జోరూట్, తాజా ఎడిషన్‌లో 30 ఇన్నింగ్స్‌ల్లో 1430 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ2594 పరుగులతో 8వ స్థానంలో నిలిచాడు.
ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అబ్దుల్లా షఫీక్(184 బంతుల్లో 10 ఫోర్లతో 2 సిక్స్‌లతో 102), షాన్ మసూద్(177 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 151), సల్మాన్ అఘా(119 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104 నాటౌట్) శతకాలతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు తీయగా, జాక్ లీచ్(3/160) మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ తీసారు. అనంతరం ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవరల్లో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(64 బంతుల్లో 11 ఫోర్లతో 64 బ్యాటింగ్), జో రూట్(54 బంతుల్లో 2 ఫోర్లతో 32 బ్యాటింగ్) ఉన్నారు. కెప్టెన్ ఓలీ పోప్(0) విఫలమయ్యాడు. నసీమ్ షాకు ఓ వికెట్ దక్కింది.