Top Ad unit 728 × 90

క్రిస్‌ గేల్ మెరుపు సెంచరీ... అయినా ఓటమి!

క్రిస్‌ గేల్ మెరుపు సెంచరీ... అయినా ఓటమి!

కరీబియన్ ప్రీమియర్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. స్వదేశంలో జరుగుతున్న టీ20 లీగ్‌ లో కరీబియన్ స్టార్లతో పాటు విదేశీ క్రికెటర్లు రెచ్చిపోతున్నారు. లీగ్‌ లో భాగంగా జమైకా తలావాస్, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్ పాట్రియాట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ లో పరుగుల వరద పారింది. ఈ టీ20 మ్యాచ్‌లో బ్యాట్స్‌ మెన్ వీరబాదుడు బాదుతుంటే.. బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ మ్యాచ్‌ లో విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌గేల్ 62 బంతుల్లో 7ఫోర్లు, 10 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. గేల్ మెరుపు సెంచరీతో జమైకా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసింది. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ ఈ టార్గెట్‌ ను ఛేదించడం కష్టమేనని అంతా భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇంకో ఏడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌ మెన్ సమష్టిగా రాణించడంతో 18.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి సెయింట్ కిట్స్ గెలుపొందింది.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

క్రిస్‌ గేల్ మెరుపు సెంచరీ... అయినా ఓటమి! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *