Top Ad unit 728 × 90

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై సంచలన వ్యాఖ్యలు: మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై సంచలన వ్యాఖ్యలు: మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ

టీం ఇండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ దేశంలోనే అతి పెద్ద స్కామ్‌గా ఆయన వర్ణించారు. నగదు బదిలీకి ఐపీఎల్ ఓ మాద్యమంలా పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘నాకు ఐపీఎల్ గురించి ఇష్టం లేదు. ఐపీఎల్ కంటే భారతదేశంలో పెద్ద కుంభకోణం లేదు. ఐపీఎల్‌కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో... ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. సౌతాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ రెండో సీజన్‌ కోసం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా కోట్లాది రూపాయిలు దేశాన్ని దాటించారు’’ అని అన్నారు.

అంతేగాక... ఐపీఎల్‌ను ఆధారంగా తీసుకొని జాతీయ జట్టు కోసం ఆటగాళ్లను ఎంపిక చేయవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘జట్టు ఎంపికకు ఐపీఎల్ ఆధారం కాకూడదు, ఐపీఎల్‌లో జట్టులో ఒక ఆటగాడికి ఎక్కువ డబ్బులు ఇస్తారు, కొందరికి తక్కువ డబ్బులు ఇస్తారు. తక్కువ డబ్బులు వచ్చే ఆటగాడు... ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్‌లకు పాల్పడుతాడు. కాబట్టి ఐపీఎల్‌ని కాకుండా స్థానికంగా జరిగే టీ-20 టోర్నమెంట్ల ఆధారంగా జాతీయ జట్టు ఎంపికలు జరగాలి’’ అని ఆయన తెలిపారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై సంచలన వ్యాఖ్యలు: మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *